Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబైలో 'తలైవా' ఐపీఎల్ -- దర్బార్ షూటింగ్ ముచ్చట్లు

ముంబైలో 'తలైవా' ఐపీఎల్ -- దర్బార్ షూటింగ్ ముచ్చట్లు
, శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (12:51 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ పని చేసినా అది సంచలనమే అవుతుంది. ఆయన సిగరెట్ వెలిగించినా, చేయి తిప్పినా లేదా క్రికెట్ బ్యాట్ పట్టినా సరే అది మీడియాకు సంచలన వార్తకిందే లెక్క. ప్రస్తుతం ఆయన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో "దర్బార్" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది. 
 
ఈ చిత్రం షూటింగ్ గ్యాప్‌లో చిత్ర బృందంతో కలిసి రజనీకాంత్ క్రికెట్ ఆడగా, ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటిని చూసిన రజనీ అభిమానులు "ఇది తలైవా ఐపీఎల్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రజినీతోపాటు హీరోయిన్ నయనతార, కమెడియన్ యోగిబాబు తదితరులు కూడా క్రికెట్ ఆడారు. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్‌గా నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పబ్లిక్‌గా ప్రియుడుకి ముద్దుపెట్టిన 'మణికర్ణిక' నటి