టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈసారి ప్రపంచ కప్‌ను సాధించిపెడతాడని.. మాజీ స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ కప్ పోటీలు మే 30వ తేదీ నుంచి ఇంగ్లండ్‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భారత క్రికెట్ జట్టును ఏప్రిల్ 15వ తేదీన ప్రకటించారు. ఈ ప్రపంచ కప్‌లో ధోనీని అదృష్టం వరించాలని కోరుకుంటున్నానని తెలిపాడు.
సెలెక్టర్లపై విమర్శలు తగవు. దినేష్ కార్తీక్, రిషబ్ పంత్ వ్యవహారంలో సెలెక్టర్ వారి పనేంటో వారు చేశారన్నాడు. ప్రపంచ కప్ గెలవడం అంత సులభం కాదన్నాడు. క్రికెటర్లు గాయాల బారిన పడకుండా చూసుకోవాలి. అదృష్టం వరిస్తే.. టీమిండియా ఈసారి వరల్డ్ కప్ విజేతగా నిలుస్తుందని చెప్పాడు.
ఇకపోతే.. ధోనీ ఈ ఐపీఎల్ సీజన్‌లో అంచనాల మించి రాణిస్తూ ఔరా అనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోనీపై కపిల్ దేవ్ ప్రశంసలు గుప్పించాడు. అసలు ధోని తరహా క్రికెట్ ఆడే క్రికెటర్ భారత్‌లో ఎవడూ లేడంటూ అతి పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చేశాడు. ధోని తరహాలో అటు గేమ్‌పై ఇటు ఫిట్‌నెస్‌పై దృష్టి నిలపాలంటే ఎవరికైనా భారంగానే ఉంటుంది.
ధోని కంటే ఎక్కువగా దేశం కోసం సేవ చేసిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే లేరనే చెప్పాలని కపిల్ కామెంట్ చేశాడు. రానున్న వరల్డ్‌కప్‌లో కూడా ధోని కీలక పాత్ర పోషించడం ఖాయమని కపిల్‌దేవ్ ఆకాంక్షించాడు.