Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రజినీకాంత్ కుడిచేతి చూపుడు వేలికి సిరా గుర్తు.. వివరణ కోరిన ఈసీ

రజినీకాంత్ కుడిచేతి చూపుడు వేలికి సిరా గుర్తు.. వివరణ కోరిన ఈసీ
, శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (16:30 IST)
దేశంలో 17వ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులోభాగంగా, ఈనెల 11వ తేదీన తొలి దశ పోలింగ్ జరుగగా, 18వ తేదీన రెండో దశ పోలింగ్ ముగిసింది. ఈ రెండో దశలో తమిళనాడులో 38 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. వేలూరు లోక్‌సభ స్థానానికి జరగాల్సిన ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. అలాగే, 18 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగాయి. 
 
అయితే, లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన స్టెల్లా మెరీస్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూతులో ఓటు వేశారు.
 
అయితే, ఎన్నికల సిబ్బంది ఆయనకు కుడిచేతి చూపుడు వేలికి ఇంకు మార్కు వేశారు. ఇది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఓటు వేసేందుకు వెళ్లే వ్యక్తికి ఎడమ చేయి చూపుడు వేలిపై ఇంకు మార్కు వేస్తారు. చూపుడు వేలికి ఏదేని గాయమైవున్నట్టయితే పక్కన ఉండే మధ్యవేలికి వేస్తారు.
 
కానీ, రజినీకాంత్‌కు మాత్రం కుడిచేతి చూపుడు వేలికి ఈ మార్కు వేశారు. దీనిపై జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి వివరణ కోరినట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు కోరారు. మొత్తంమీద రజినీకాంత్ ఏది చేసినా అది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీని ప్రారంభించిన ఆయన ఎన్నికల్లో పోటీకి మాత్రం దూరంగా ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే ఎన్నికల్లో నా తడాఖా చూపిస్తా : రజినీకాంత్