Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బ్రహ్మాస్త్ర' ఏమైందో తెలుస్తూనే వుంది, రూ. 600 కోట్లు కాల్చి బూడిద చేసాడు: కంగనా రనౌత్ ఘాటు విమర్శలు

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (22:44 IST)
బ్రహ్మాస్త్ర చిత్రం నిన్న విడుదలై మిశ్రమ స్పందనను రాబట్టుకుంది. ఈ చిత్రం గురించి ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. వీరిలో తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా చేరిపోయారు. ఆమె బ్రహ్మాస్త్ర చిత్ర దర్శకుడు, నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
ఈ చిత్రం కోసం దర్శకుడు అయాన్ ముఖర్జీ రూ. 600 కోట్లు కాల్చి బూడిద చేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు కంగనా. మంచి చిత్రం తీసాడంటూ అయాన్ ముఖర్జీని మెచ్చుకునేవారందరినీ జైల్లో పెట్టాలంటే ఘాటు వ్యాఖ్యలు చేసారు.

 
దర్శకుడు అయాన్ గురించి చెబుతూ... ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి అతడికి 12 ఏళ్లు పట్టింది. 400 రోజులు షూట్ చేసి 85 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను మార్చి రూ. 600 కోట్లు కాల్చి బుగ్గి చేసాడు. బాహుబలి చిత్రం సక్సెస్ కావడంతో బ్రహ్మాస్త్ర సినిమా పేరును జలాలుద్దీన్ రూమీ నుంచి శివగా ఆఖరి నిమిషంలో మార్చాడంటూ తూర్పూరబట్టారు.

 
నిర్మాత కరణ్ జోహార్ స్టైల్ డిఫరెంట్. అతడికి స్క్రిప్టులు అవసరంలేదు. ఇతరుల శృంగార జీవితాలపై విపరీతమైన ఆసక్తి చూపిస్తుంటాడు. రివ్యూలు, రేటింగ్స్, కలెక్షన్స్.. అంతా డబ్బుతో కొనేస్తుంటాడు. తను తీయాల్సిన సినిమాలో టాలెంట్ వున్న నటీనటులను, కథాబలం చూసుకోకుండా అంతా చిత్రాన్ని ప్రమోట్ చేసేందుకు దక్షిణాది సినీ నటులు, దర్శకులు వెంటబడ్డాడు. దానికంటే కంటెంట్ పైన శ్రద్ధ పెడితే సరిపోయేది కదా అంటూ సెటైర్లు వేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురంలో 12 మంది అమ్మాయిలు పచ్చిబూతు డ్యాన్సులు (Video)

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

Telangana Cabinet expansion: కొండా సురేఖ అవుట్ విజయశాంతి ఇన్?

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments