ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పని సినిమా చేయడమేనని నటి కంగనా రనౌత్ తెలియజేస్తున్నారు. ఈరోజు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో తన అభిప్రాయాల్ని పోస్ట్‌చేశారు. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం 'ఎమర్జెన్సీ . 1975లో ఎమర్జన్సీ కాలంనాటి కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రను ఆమె పోషిస్తోంది. ఈరోజు నటి కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం 'ఎమర్జెన్సీ' సెట్స్ నుండి ఒక స్ట్రింగ్ ఫోటోగ్రాఫ్‌ను పంచుకుంది. దానితోపాటు ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పని సినిమాలు తీయడమే అని పేర్కొంది.
ఈ రోజు సన్నివేశాన్ని వివరిస్తూ అంబాసిడర్ కారు కూడా ఉంది. దానిలో నేను ఎక్కి మీటింగ్‌కు వెళుతున్నానంటూ చెప్పింది. అసలు నాకు ఇష్టమైంది దర్శకత్వం చేయడం అని కూడా తెలిసింది. ఈ ఎమర్జన్సీ సినిమా మేకింగ్ చాలా విషయాలు తెలుసుకుంటున్నానని తెలిపింది. ఈ కథ మార్చి 21, 1977 వరకు కొనసాగింది, జనతా పార్టీకి కాంగ్రెస్‌కు మధ్య జరిగే చారిత్రాత్మక ఎన్నికల్లో అధికారం ఎలా వచ్చిందనే వరకు కథ వుంటుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ కూడా నటించారు. గతంలో 'కహానీ', 'పింక్', 'రైడ్' మరియు 'ఎయిర్‌లిఫ్ట్' వంటి ప్రముఖ చిత్రాలతో అనుబంధం కలిగి ఉన్న రితేష్ షా ఈ సినిమా డైలాగ్స్ రాస్తున్నారు.