గురువారంనాడు విడుదలైన లైగర్ సినిమా గురించి టాలీవుడ్‌లోకంటే బాలీవుడ్‌లోనే పెద్ద చర్చ జరుగుతోంది. సినిమా విడుదలకుముందు ఫస్ట్ ట్విట్టర్ రివ్యూకింద ఓ ఎనలిస్ట్ సూపర్ డూపర్ హిట్ అంటూ పెట్టాడు. కానీ రిలీజ్ తర్వాత డివైడ్ టాక్ వచ్చేసింది. ఇక దీనిపై రివ్యూలతో చెండాడే బాలీవుడ్ ఎనలిస్ట్, నటుడు కమల్ ఆర్ ఖాన్ (కె.ఆర్.కె.) ఏకిపారేశారు.
సినిమా ఆరంభంలోనే విజయ్‌దేవరకొండ, రమ్యకృస్ణ చాయ్ దుకాణం ముంబైలో నడుపుతుంటారు. వీధి రౌడీ వచ్చి మామూలుకోసం గొడవచేస్తే కొండ.. ఫైట్ చేస్తాడు. ఈ సీన్ ఎప్పుడో వచ్చిన `దేశద్రోహి` సినిమాకు కాపీ. అదేవిధంగా బాక్సింగ్ నేపథ్యంలో తీసిన ఈ లైగర్ సీన్స్ కూడా తూఫాన్ సినిమాకు చాలా పోలికలున్నాయి. దాదాపు 64 సీన్స్‌లో అంతా యాక్షన్ ఎపిసోడ్. వుంటాయి. ఇవన్నీ సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. చుంకీపాండే పాత్ర మినహా మిగిలిన పాత్రలన్నీ పెద్దగా నచ్చలేదు. రమ్యకృష్ణ పాత్ర బాహుబలిలో చూపించినట్లుగా పెద్దగా అరుస్తుంటుంది. హీరోయిన్ అనన్యపాండే కేవలం సాంగ్స్ కోసమే పెట్టినట్లుంది. ఆమె లవ్ ట్రాక్, తన సోదరిడితో లైగర్ శత్రువుగా చూపించడం అంతా గందరగోళంగా వుంది.
ఇక క్లయిమాక్స్‌లో మైక్ టైసన్ ఫైట్ చెత్తగా వుంది. ఆ ఫైట్‌ను కామెడీ చేసేశారు. టైసన్‌ను విలన్‌గా చూపించేశారు. కానీ క్లయిమాక్స్ ఇదికాదు. కరణ్‌జోహార్ క్లయిమాక్స్ ఏది? ఏమంత బాగోలేదని అడిగితే, పూరీ ఇంకో 40 కోట్లు ఇస్తే సరిపోతుంది అన్నట్లుగా వుందని కె.ఆర్.కె. కామెంట్ చేశారు. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు 160 కోట్లు తీసుకున్నాడని కె.ఆర్.కె. తెలియజేస్తున్నారు. 160 కోట్లు తీసుకుని ఫ్లాప్ స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ పూరీ జగ్గనాథ్ ఇచ్చాడని తప్పుపట్టాడు. ఎవరినైనా అసిస్టెంట్లు పెట్టుకుని ఇంకాస్త జాగ్రత్తగా డైలాగ్స్‌లు, కథను రాసుకోవచ్చగదా అంటూ మండిపడ్డాడు.
విజయ్‌దేవరకొండ గురించి నాకు పెద్ద తెలీదు. అతని సినిమా బాలీవుడ్‌లో ఇదే కావడంతో ఆయన డైలాగ్స్ కూడా సరిగ్గా పలకపోవడంతో నత్తి పెట్టడంతో ఆయన యాక్టింగ్ జీరో అంటూ కె.ఆర్.కె. తెలియజేశారు. ఈ సినిమాను చూడాలంటే డబ్బులు ఎక్కవయితే చూడండి. లేదంటే హాయిగా దేనికైనా ఖర్చు చేయండంటూ వీడియోలో తెలియజేశాడు.