బిగ్ బాస్ మూడో సీజన్‌లో పాల్గొన్న పునర్నవి ఈ షో వల్ల ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్ ట్రాక్ కూడా ఆమె ఎక్కువగా వార్తల్లో నిలవడానికి కారణమైంది.
కమిట్‌మెంటల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా తనకు ఎంగేజ్‌మెంట్ అయినట్లు వెల్లడించిన పునర్నవి ఆ తర్వాత వెబ్ సిరీస్ కోసం ఆ విధంగా ప్రమోషన్స్ చేసినట్టు తెలిసి కొంతమంది నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు.
తాజాగా నెటిజన్లతో పునర్నవి ముచ్చటించగా ఒక నెటిజన్ పునర్నవిని నువ్వు వర్జిన్ వేనా అని ప్రశ్నించారు. మరో నెటిజన్ ఆమెతో ఏకంగా ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నావా? అని ప్రశ్నించాడు. నేను ఇలాంటి ప్రశ్న కోసమే ఎదురుచూస్తున్నా అంటూ మొదటి ప్రశ్నకు అవును ఆమె అంటూ రెండో ప్రశ్నకు జవాబిచ్చారు. ఆ ప్రశ్నలు అడిగిన నెటిజన్లకు బుద్ధి వచ్చేలా పునర్నవి సమాధానాలు ఇచ్చింది. ఈ ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.