Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అంటున్న జానీ మాస్టర్

డీవీ
బుధవారం, 3 జులై 2024 (15:21 IST)
Johnny Master, Ramcharan, upsana konidala
సరైన సమయంలో సహాయం చేసేవాడు దేవుడు అని రాంచరణ్, ఉపాసన ను కలిసిన సంధర్భంగా కొరియో గ్రాఫర్, డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ అన్నారు. నిన్న జానీ మాస్టర్ పుట్టినరోజు. నా పుట్టినరోజు సందర్భంగా చరణ్ అన్న ఇంటికి పిలిచినపుడు వారికి నా మీదున్న ప్రేమకి చాలా సంతోషపడ్డా అని జానీ మాస్టర్ తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇంటికి  వెళ్ళాక మెగాస్టార్ చిరంజీవి గారి  ఆశీర్వాదం తో పాటు చరణ్ అన్న, ఉపాసన వదిన నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం 1000 రెట్లు పెరిగింది తెలిపారు. 
 
నేను ఇదివరకు అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని మా డ్యాన్సర్స్ యునియన్ టి. ఎఫ్. టి. టి. డి. ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్స్యూరెన్స్ అందేలా వారు అండగా నిలబడతామన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని, ఇచ్చిన మాటకి విలువనిస్తూ, అన్ని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది.
 
మా అందరి తరపు నుండి అన్న, వదినలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీలాంటి వారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని జానీ తెలిపారు. 
 
ఇదిలాఉండగా, గత కొద్దీ రోజులుగా సురేష్ అనే డాన్సర్ చేసిన డాన్సర్స్ కు హెల్త్ ఇన్సూరెన్స్ జానీ మాస్టర్ ఇవ్వడం లేదని చేసిన ఆరోపణలకు చెక్ పెట్టినట్లయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రహ్మోత్సవాలు.. లక్షలాది మంత్రి యాత్రికుల కోసం 1,930 ట్రిప్పులు

సమంత విడాకుల అంశంలో నా మాటలు తప్పే.. కానీ.. : మంత్రి కొండా సురేఖ

యూపీలో ఘోరం.. రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి

సినీ ప్రముఖులే సాఫ్ట్‌కార్నర్‌గా మారుతున్నారు : తెలుగు ఫిల్మ్ చాంబర్

జనసేన సనాతన ధర్మం డిక్లరేషన్: తిరుపతి వారాహి సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments