Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

Johnny Master  Dancer Satish

డీవీ

, శనివారం, 22 జూన్ 2024 (19:27 IST)
Johnny Master Dancer Satish
తెలుగు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూ, డాన్సర్ సతీష్ కు మధ్య గొడవ విషయం తెలిసిందే. అయితే అసలు గొడవకు కారణం ఏమిటి? అని ఆరాతీస్తే.. తాజాగా సతీష్ చెప్పిన విశేషాలు ఏమిటో తెలుసా? ఆధిపత్య పోరు. తాను చెప్పినట్లే అందరూ వినాలనే నియంత్రుత్వ తత్త్వం జానీ మాస్టర్ దట. సతీష్ కు ఇండస్ట్రీలో 30 ఏళ్ల అనుభవం.జానీ మాస్టర్ కు 13 ఏళ్ల అనుభవం ఉంది. 
 
వివరాల్లోకి వెళితే.. సతీష్ మాటల్లో...  దాదాపు 500  మంది సభ్యులున్న డాన్సర్ యూనియన్ కు 2023 ఎన్నికల్లో జానీ మాస్టర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు వున్న కమిటీవారు పెద్దగా పనిచేసింది లేదు. అయితే నేను వస్తే.. సభ్యులందరికీ ఇన్ సూరినెన్స్, ఇండ్లు ఇప్పిస్తానని  జానీ వాగ్దానం చేశాడు. గతంలో రెండు సార్లు జానీ పోటీచేసి ఓడిపోయాడు కూడా. ఈసారి పది లక్షలు ఖర్చు పెట్టి గెలిచాడు. గెలిచాక జనరల్ బాడీ మీటింగ్ లోనూ, కార్యవర్గ మీటింగ్ లోనూ తాను చెప్పిన హామీలు నెరవేరుస్తానని అన్నాడు. కానీ ఇంతవరకు అతీగతీ లేదు. 
 
హైదరాబాద్ శివార్లో నవాబ్ పేటలో ఓ లాండ్ చూశాం. అందుకు ఐదు కోట్ల రూపాయలు సత్యవర్మ అనే రియల్ ఎస్టేట్ కు ఇచ్చారు.. ఇలా ఇవ్వాలని జనరల్ బాడీలో నిర్ణయం తీసుకున్నాం.  వాళ్ళు వెంచర్ చేసి ఐదువంల ప్లాట్ గా ఇస్తామని చెప్పారు. కానీ ఆ తర్వాత అతీ గతీ లేదు. దీనిపై ఓసారి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో జానీ ని అడిగాం. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చంద్రబాబుతో మాట్లాడుతున్నాం. త్వరలో వచ్చేస్తాయి అంటూ దాట వేశారు. అసలు హైదరాబాద్ లోని స్థలానికి వారికి సంబంధం ఏమిటో అర్థంకాలేదు.
 
మీటింగ్ లో జరిగిన విషయాన్ని వీడియో గ్రాఫర్ తీసిన దానిని నేను వాట్సప్ స్టేటస్ లో వీడియో పెట్టుకున్నాను. కేవలం దాన్ని చూసి నాకు వార్నింగ్ ఇచ్చాడు. నీ అంతు చూస్తా? అని ఫోన్ లో తిట్టాడు. తిట్టడమేకాకుండా నీకు అవకాశాలు లేకుండా చేస్తాననంటూ వార్నింగ్ ఇచ్చాడు.
 
అసలు జానీ మాస్టర్ అయ్యాక తెలుగువారికి ఎవరికీ సరైన అవకాశాలు ఇవ్వలేదు. బాలీవుడ్, హాలీవుడ్ డాన్సర్ల ను పెట్టి సినిమాలు చేసేవాడు. ఇదేమని ఎవరైనా సభ్యుడు అడిగితే.. వారికి డబ్బు ఆశచూపి పదివేలు, ఇరవై వేలు లంచాలు ఇచ్చి మేనేజ్ చేసేవాడు. అందుకే సభ్యులంతా విసిగిపోయారు. వారి తరఫున నేను మాట్లాడుతున్నా. అందుకే నన్ను టార్గెట్ చేశాడు అంటూ.. సతీష్ వాపోయాడు. మరి ఇది ఎంతవరకు దారితీస్తుందే చూడాలి. 2025 సెప్టెంబర్ వరకు జానీ మాస్టర్ పదవీ కాలం వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం