Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ బాణసంచాలతో సందడి - ఒక చారిత్రాత్మక క్షణం అన్న సినీ ప్రముఖులు

Advertiesment
CBN with chiru familky

డీవీ

, బుధవారం, 12 జూన్ 2024 (17:34 IST)
CBN with chiru familky
క్రికెట్ లో ఇండియా గెలిస్తే ఎంత ఆనందంగా వుంటుందో ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం హైదరాబాద్ లో చాలా చోట్ల సందడి నెలకొంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మంత్రిగా తాను ప్రమాణం చేస్తున్నట్లు ప్రకటించగానే జూబ్లీహిల్స్ లోనూ, శ్రీనగర్ కాలనీలోనూ ఇంకా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అభిమానులు బాణా సంచా కాల్చి సంబరాలు జరుపుకోవడం విశేషం.
 
Krish, nikil, mehar ramesh
ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గన్నవరం సమీపాన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందులో తాము పాల్గొనడం ఒక చారిత్రాత్మక క్షణంగా తెలుగు చలన చిత్ర ప్రముఖులు పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి, ఛాంబర్ పెద్దలతోపాటు పలువురు హీరోలు కూడా అక్కడికి హాజరయ్యారు. 
 
CBN with chiru family
హీరో నిఖిల్, దర్శకులు క్రిష్, మెహర్ రమేష్ తోపాటు పలువురు హాజరయ్యారు. ఇంకా పలువురు తాము పాల్గొన్న ఫొటోలు షేర్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు.
 
ఇక మెగా ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన పనలేదు. స్టేజీ పైనే ప్రధాని మోదీతో తన అన్న చిరంజీవి గురించి చెప్పి దగ్గరకు తీసుకువెళ్ళి కలిపించడం మెగా అభిమానులకు ఉత్సాహపరిచింది. ఈ వేడుకను చూసేందుకు రామ్ చరణ్ తదితరులు నిలుచుని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కనిపించారు. 
 
CBN, charan
అనంతరం చంద్రబాబు కిందకు రాగానే మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ లతో చంద్రబాబు ఆప్యాయంగా పలుకరిచడం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. 
 
ఇక అల్లు అర్జున్ వై.సి.పి. అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో అతనికి మైనస్ గా మారింది. పవన్ కళ్యాన్ హైదరాబాద్ వచ్చి చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అందరూ వచ్చారు కానీ అల్లు అర్జున్ హైదరాబాద్ లో వుండి కూడా రాలేదు. ఇప్పటికే అల్లు అర్జున్ పై చిరంజీవి కుటుంబంపై కొంతకాలంగా నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో తెగ చర్చ కూడా జరిగింది. కొంతకాలం గడిచాక అల్లు అర్జున్ దీనిపై ఏదైనా స్టేట్ మెంట్ ఇస్తాడేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ సినిమా నేరుగా ఓటీటీలోకి..