choreographer Johnny Master
ప్రస్తుతం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. డాన్సర్ గా తన కెరీర్ ను మలుచుకున్న తొలి రోజుల్లో డాన్సర్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జానీ మాస్టర్ అసలు పేరుకంటే పవన్ కళ్యాణ్ జానీ సినిమాకు పనిచేయడంతో దానినే తన పేరుగా మార్చుకున్నాడు. దాంతో అదే అసలు పేరుగా మారిపోయింది. నితిన్ తో కూడా ఓ సినిమాకు పనిచేశాడు.
ఇలా అగ్ర హీరోల సినిమాలకు పనిచేస్తున్న ఆయన్ను టీ వీ షోలు జడ్జిగానూ వెళ్ళాడు. దాంతో మరింత పాపులరాలిటీ సంపాదించుకున్నాడు. డాన్స్ లో తన కంటూ ఓ స్టయిల్ ను ఏర్పరచుకుని పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ కు పనిచేశాడు. ఇంకా పలు సినిమాలు చేస్తున్న ఆయన గత ఏడాది డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
హైదరాబాద్ లో అసోసియేషన్ వుండడంతో ప్రాంతీయ బేధం వచ్చింది. దాంతో సతీష్ అనే డాన్సర్ ఆయనపై పలు ఆరోపణలు చేశాడు. జానీ మాస్టర్ పై కొన్ని వివాదాలున్నా ఈసారి సతీష్ అనే డాన్సర్ తనను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నాడని వాపోయాడు. అయితే ఇవన్నీ గిట్టక తనపై ఆరోపణలు చేస్తున్నాడని జానీ మాస్టర్ ప్రతి స్పందించారు. అలాంటి జానీ మాస్టర్ పుట్టినరోజు నేడు. డాన్సర్ గా ఉన్నత స్థాయికి చేరుకున్న జానీ మాస్టర్ మరిన్ని సినిమాలు చేయాలని ఆశిద్దాం.