Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొబైల్ వినియోగదారులకు శుభవార్త.. బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే ఆఫర్!!

bsnl

వరుణ్

, మంగళవారం, 2 జులై 2024 (12:40 IST)
భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ మొబైల్ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. కేవలం 249 రూపాయలకే 48 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. దేశంలోని ప్రైవేట్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవలే తమ తమ టారిఫ్ ధరలను పెంచాయి. ఈ పెంచిన చార్జీలు జూలై మూడు, నాలుగు తేదీల్లో నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కంపెనీలు దాదాపు 26 శాతం మేరకు పెంచాయి. సుమారు రూ.600 మేరకు అదనపు భారం పడనుంది. 
 
ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా ఓ కొత్త ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఈ ప్లాన్ ధర కేవలం రూ.249 మాత్రమే. ఈ కొత్త ప్లాన్ 45 రోజుల కాలపరిమితి కల్పించింది. ఇది సాధారణ ప్లాన్ల కంటే చాలా ఎక్కువ. ఇండియాలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యం ఉంది. రోజుకు 2జీబీ డేటా వస్తుంది. రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్లను వినియోగదారులు వాడుకోవచ్చు.
 
ఇక ఇదే ధరలో ఎయిర్ టెల్ కూడా తమ కస్టమర్లకు ఒక ప్లాను అందిస్తోంది. అయితే, ఇది కేవలం 28 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అలాగే రోజుకు కేవలం 1జీబీ డేటా మాత్రమే వస్తుంది. అదే బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న రూ.249 ప్లాన్ కాలపరిమితి 45 రోజులు. అలాగే రోజూ 2జీబీ డేటాను వినియోగదారులు పొందవచ్చు. అంటే.. కొత్త బీఎస్ఎన్ఎల్ ప్లాన్ వినియోగదారుకు 17 అదనపు రోజుల సర్వీస్‌ను అందించడమేకాకుండా, అదే ధరలో లభించే ఎయిర్ టెల్ ప్లాన్‌‍తో పోల్చితే రోజువారీ డేటా కూడా రెట్టింపు వస్తుంది. దీంతో అధిక టారీఫ్ నుంచి ఉపశమనాన్ని కోరుకునే మొబైల్ యూజర్లను ఆకట్టుకునేందుకే బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలున్న ఈ ప్లాన్‌ను తీసుకొచ్చిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆత్మహత్య చేసుకున్న రోబో.. నిజమా? ఎక్కడ?