Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆత్మహత్య చేసుకున్న రోబో.. నిజమా? ఎక్కడ?

Advertiesment
robot

వరుణ్

, మంగళవారం, 2 జులై 2024 (12:03 IST)
సాధారణంగా కష్టాల కడలిని దాటలేనివారు ఆత్మహత్యలు చేసుకుంటారు. కానీ, ఓ రోబో ఆత్మహత్య చేసుకుంది. ఇది వినడానికి విచిత్రంగా ఉంది. మీరే కాదు యావత్ ప్రపంచం కూడా నివ్వెరపోతుంది. ప్రపంచంలోనే తొలిసారిగా దక్షిణ కొరియాలో ఒక రోబో ఇటీవల ప్రాణాలు తీసుకుంది. గుమీ నగరంలోని సిటీ హాల్ ఆఫీసులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న ఒక రోబో ఉద్దేశపూర్వకంగానే రెండు మీటర్ల పొడవున్న మెట్ల మీద నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. 
 
ఈ రోబో మెట్లపై నుంచి దూకడంతో ఏమాత్రం కదలికలు లేని స్థితిలో దాన్ని గుర్తించారు. తనను తాను అంతం చేసుకొనే ముందు రోబో విచిత్రంగా ప్రవర్తించిందని.. ఒకేచోట అదేపనిగా గుండ్రంగా తిరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధిక పనిభారం లేదా యంత్రంలో సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనను దేశంలోనే తొలి రోబో ఆత్మహత్యగా స్థానిక మీడియాతోపాటు నెటిజన్లు అభివర్ణిస్తున్నారు.
 
మరోవైపు, ఈ ఘటనను ఆత్మహత్యగా పేర్కొనడం నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే.. రోబోలు భావోద్వేగాలకు గురయ్యే లేదా తనను తాను అంతం చేసుకొనే సామర్థ్యం లేనందున ఇది ఎలా జరిగి ఉండొచ్చన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రోబో కదలికలకు దోహదపడే నేవిగేషన్‌లో లోపాలు, సెన్సార్ల వైఫల్యం, ప్రోగ్రామింగ్‌లో బగ్ వల్ల రోబో ఇలా విచిత్రంగా ప్రవర్తించి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ ఓటమికి ఆ ఇద్దరే కారణం.. ముంచేశారు.. షర్మిల ఆర్కేతో భేటీ: కేతిరెడ్డి