జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టులో ఊరట... విదేశాలకు పర్మిషన్ అక్కర్లేదు...

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (11:10 IST)
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టులో ఉపశమనం లభించింది. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి అక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆమెకు గతంలో విధించిన బెయిల్ షరతును సవరించింది. దీంతో కోర్టు నుంచి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు జాక్వెలిన్‌కు వెసులుబాటు లభించింది. 
 
దాదాపు రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌ నుంచి జాక్వెలిన్‌ అత్యంత ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన ఈడీ.. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ అనుబంధ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. ఈ కేసులో గత ఏడాది ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దానికింద ఆమె విదేశాలకు వెళ్లాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడు దానిని సవరించింది. 
 
నిందితురాలు ఇప్పటివరకు ఐదు సందర్భాల్లో విదేశాలకు వెళ్లేముందు ముందస్తు అనుమతి తీసుకున్నారని, ఎక్కడా బెయిల్ ద్వారా లభించిన స్వేచ్చను ఆమె దుర్వినియోగం చేయలేదని ఢిల్లీ పాటియాలా కోర్టు గుర్తించింది. 'దేశాన్ని విడిచే వెళ్లేముందు ముందస్తు అనుమతి గజిబిజిగా ఉండొచ్చు. అలాగే ఒక నటిగా ఆమె అవకాశాలు కోల్పోవడానికి దారితీయొచ్చు' అని వ్యాఖ్యానిస్తూ, తాజాగా బెయిల్ నిబంధనలను సడలించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Final Supermoon of 2025: 2025లో చివరి పౌర్ణమి డిసెంబర్ 4.. సూపర్ మూన్ ఇదే లాస్ట్

తెలంగాణ రాజ్‌భవన్ పేరు మారిపోయింది...

ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

కేరళ పంచాయతీ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ

రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పేరు మార్చాలి.. తెలంగాణ గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments