Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2023 సంవత్సరానికి న్యూ ఇన్వెస్టిగేటర్ ట్రావెల్ అవార్డును అందుకున్న కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ పీహెచ్‌డి స్కాలర్

image
, మంగళవారం, 11 జులై 2023 (23:03 IST)
అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూ ఇన్వెస్టిగేటర్ ట్రావెల్ అవార్డును 2023 సంవత్సరానికిగానూ తమ యూనివర్సిటీలోని బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో Ph.D. స్కాలర్ అయిన లక్ష్మీ సౌమ్య ఈమని అందుకోవడానికి ఎంపికయ్యారని కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వెల్లడించింది. కెఎల్ డీమ్డ్ టు బి  యూనివర్శిటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ జగన్నాథరావు మార్గదర్శకత్వంలో ఆమె చేసిన అసాధారణ పరిశోధనలకు గుర్తింపుగా ఈ అవార్డు నిలుస్తుంది. USAలో ఉన్న ఎన్విరాన్‌మెంటల్ మ్యూటాజెనిసిస్ అండ్ జెనోమిక్స్ సొసైటీ (EMGS) యొక్క అవార్డులు&ఆనర్స్ కమిటీ ఆమెను ఈ గౌరవానికి ఎంపిక చేసింది. 2023 సెప్టెంబరులో చికాగోలో జరుపనున్న అవార్డు వేడుకలో లక్ష్మి తన విప్లవాత్మక పరిశోధనలను ప్రదర్శించే అవకాశం ఉంది.
 
న్యూరోసైన్స్‌లో అద్భుతమైన నైపుణ్యాన్ని లక్ష్మి కలిగి వున్నారు. న్యూరోడీజెనరేటివ్ బ్రెయిన్(మెదడులో కణాల క్షీణత వ్యాధి)లోని B-Z ఆకృతి నుండి DNA నిర్మాణంలో మార్పుకు సంబంధించి మార్గదర్శక అధ్యయనంపై ఆమె ప్రెజెంటేషన్ దృష్టి పెడుతుంది. ఆమె పరిశోధన మనిషిని బలహీనపరిచే పరిస్థితులైన అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వ్యాధులకు కారణమయ్యే మెదడులో కణాల క్షీణతకు సంబంధించి ఈ నిర్మాణాత్మక మార్పు యొక్క సంభావ్య ప్రభావాన్ని ప్రతిపాదిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మెదడు సమస్యలు ఒక ముఖ్యమైన సవాలుగా కొనసాగుతున్నందున, 2050 నాటికి 155 మిలియన్ కేసులు వచ్చే అవకాశాలు వున్నాయని అంచనా వేయబడింది. అందువల్ల మెదడు కణాల క్షీణత వెనుక ఉన్న విధానాలను అర్థం చేసుకోవడం అత్యవసరం. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే, ఈ వ్యాధులలో 5-8% మాత్రమే జన్యుపరంగా నిర్ణయించబడుతున్నాయి, అయితే ఎవరైనా ఈ మెదడు రుగ్మతలకు గురయ్యే అవకాశం మాత్రం ఉంది.
 
జపాన్‌లోని ప్రతిష్టాత్మక సంస్థలైన OIST వంటి వాటితో కలిసి లక్ష్మి పని చేశారు. ISN ట్రావెల్ అవార్డును అందుకోవటానికి ఆమె యునైటెడ్ స్టేట్స్‌ వెళ్ళనున్నారు. మెదడు యొక్క రహస్యాలను లోతుగా పరిశోధించడానికి, మెదడు సమస్యలపై మరింత అవగాహన పొందడానికి పారిస్ బ్రెయిన్ ఇన్‌స్టిట్యూట్, ఇతర ప్రఖ్యాత సంస్థలతో కలిసి పనిచేయాలని లక్ష్మి భావిస్తున్నారు. పలు ఆసుపత్రులను సందర్శించిన వేళ ఎదురైన అనుభవాలు  మరియు మెదడు సంబంధిత వ్యాధులు కలిగిన రోగులపై కలుగుతున్న ప్రభావాలు అత్యంత సవాలుతో కూడిన ఈ రుగ్మతలను అన్వేషించడానికి ఆమెకు ప్రేరణగా నిలిచాయి.
 
కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి. పార్ధసారధి వర్మ మాట్లాడుతూ లక్ష్మి మేధో నైపుణ్యం, విశాల దృక్పథం కలిగిన విధానంతో మెదడులోని సంక్లిష్టతలను వెల్లడించటంలో ఆమె ప్రతిభను ప్రశంసించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి అద్భుతమైన ఆవిష్కరణలను తీసుకురాగల మల్టీడిసిప్లినరీ బ్రెయిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయం యోచిస్తోందని వెల్లడించారు. 2023 సంవత్సరానికిగానూ న్యూ ఇన్వెస్టిగేటర్ ట్రావెల్ అవార్డ్‌తో లక్ష్మికి లభించిన గుర్తింపు, న్యూరోసైన్స్ రంగంలో ఆమె అందించిన అశేషమైన తోడ్పాటు, మెదడు సమస్యలను అర్థం చేసుకోవడంలో ఆమె చూపిన అంకితభావాన్ని వెల్లడిస్తుంది. కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ ఆమెను ఈ అద్భుతమైన విజయానికి అభినందిస్తుంది. మానవ మెదడు గురించి మన జ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆమె నిరంతర ఆవిష్కరణల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆగ్రో కెమికల్స్ ఆవశ్యకతపై ACFI 10 మొబైల్ వ్యాన్లకు జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి