Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆగ్రో కెమికల్స్ ఆవశ్యకతపై ACFI 10 మొబైల్ వ్యాన్లకు జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి

image
, మంగళవారం, 11 జులై 2023 (22:12 IST)
గౌరవ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈరోజు ACFI ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జాగో కిసాన్ జాగో' అవగాహన ప్రచారంలో భాగంగా 10 మొబైల్ వ్యాన్‌లను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆడిటోరియం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. నాణ్యమైన వ్యవసాయ దిగుబడి, రైతులకు ఆదాయం మెరుగుపడటానికి నాణ్యమైన వ్యవసాయ ఇన్పుట్స్ (ఆగ్రో కెమికల్స్) ఆవశ్యకతపై అవగాహన మెరుగుపరుస్తూనే నకిలీ లేదా మోసపూరిత ఉత్పత్తుల కొనుగోలును నిరోధించడానికి సరైన రశీదులను పొందడం యొక్క ప్రాముఖ్యత గురించి రైతులకు అవగాహన కల్పించడానికి ఈ ప్రచారం ప్రారంభించారు.  
 
అత్యాధునిక ఆడియో విజువల్ టెక్నాలజీతో కూడిన ఈ మొబైల్ వ్యాన్‌లు రైతులకు నాణ్యమైన పంట రక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం గురించి కీలకమైన సమాచారాన్ని అందజేస్తాయి. దీనితో పాటు అత్యాధునిక ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను స్వీకరించడం గురించి రైతులకు అవగాహన కల్పిస్తూనే, సరైన డాక్యుమెంటేషన్‌తో అగ్రి-ఇన్‌పుట్‌లను కొనుగోలు చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. తెలంగాణలో ఈ మొబైల్ వ్యాన్‌లను ప్రారంభించడమనేది ఆగ్రో కెమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ఉంది. గతంలో ఇది హర్యానా, మహారాష్ట్రలలో ఈ ప్రచారం చేసింది. 
 
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖామాత్యులు శ్రీ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నుండి వివిధ రంగాలలో, మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అద్భుతమైన పురోగతిని సాధించామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రారంభించిన ప్రత్యేక పథకాలు, మరీ ముఖ్యంగా రైతు వేదికల కేంద్రాలు పంచాయతీ స్థాయిలో ఏకీకృత పరిష్కారంగా అందుబాటులో వున్నాయి. నీటిపారుదల సౌకర్యాల విస్తరణ మరియు చెరువుల పునరుద్ధరణ కారణంగా పత్తి మరియు వరి విస్తీర్ణంలో గణనీయమైన పెరుగుదల సాధ్యపడింది, ఫలితంగా వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపడింది. రైతుల సంపాదన కూడా పెరిగిందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతదేశంలో తొలి ఒబెన్ ఎలక్ట్రిక్ మోటార్‌ బైక్.. ధరెంతో తెలుసా?