Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌత్ మూవీ ఇండస్ట్రీ చాలా బలంగా ఉంది : సన్నీ డియోల్

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (10:50 IST)
దక్షిణాది చిత్రపరిశ్రమలో బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సౌత్ మూవీ ఇండస్ట్రీ ఇపుడు చాలా బలంగా ఉందన్నారు. మూలాలతో కూడిన కథతోనే చిత్రాలను తెరకెక్కిస్తున్నారని చెప్పారు. ఇపుడు హిందీ చిత్రపరిశ్రమ కూడా అదే దారిలో పయనిస్తుందని ఇది మంచి శుభపరిణామం అని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎంతోమంది ప్రతిభావంతులైన యువ కళాకారులు, టెక్నీషియన్లు రావడంతో ప్రాంతీయ సినీ పరిశ్రమ మంచి పురోగతి సాధిస్తోందన్నారు. తాజాగా ఆయన నటించిన గదర్-2 చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఆయన హైదరాబాద్ నగరానికి వచ్చిన సంద్భంగా మాట్లాడుతూ, చిత్ర విశేషాలతోపాటు భారతీయ సినీ పరిశ్రమ ఎదుగుదలను వివరించారు. 
 
ప్రపంచంలో భారతీయ సినీ పరిశ్రమ అగ్రస్థానంలో దూసుకెళ్తోందని, సినిమా పరిణామక్రమం చూస్తుంటే సృజనాత్మకతలో ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. సహజత్వానికి దగ్గరగా ఉండే కథలను ఎంపిక చేసుకోవడం వల్ల నటులు, దర్శకులు ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ మంచి విజయాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.
 
అనిల్‌ శర్మ తెరకెక్కించిన 'గదర్‌ 2' చిత్రం ఆగస్టు 11న విడుదలైంది. ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.229 కోట్లు వసూళ్లు చేసింది. 1971లో ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో సన్నీ.. తారాసింగ్‌ పాత్ర పోషించారు. సకీనాగా అమీషా పటేశ్‌ నటించారు. 2001లో వచ్చిన ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ సినిమాకి సీక్వెల్‌గా ‘గదర్‌ 2’ తెరకెక్కింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల పర్యటనకు వెళ్లనున్న జగన్... తిరుపతిలో సెక్షన్ 30 అమలు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి క్లాసుకు ఒక టీచర్ విధానం : ఏపీ మంత్రి నారా లోకేశ్

తిరుమలకు జగన్.. షరతులు విధించిన ఆర్ఆర్ఆర్.. ఏం చెప్పారంటే...?

ప్రధాని మోడీ ఆవిష్కరించి పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్ల ఫీచర్లేంటి?

సీనియర్లంటే ఆయనకు లెక్కలేదు.. పదవులు కాదు.. విలువలు ముఖ్యం : బాలినేని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

ప్రతిరోజూ 3-5 కప్పుల కాఫీ తీసుకుంటే.. అంత మేలు జరుగుతుందా?

బత్తాయి రసంలో దాగున్న ఆరోగ్య రహస్యాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments