ఓ నిర్మాతను హీరో పవన్ కళ్యాణ్ హీరోయిన్ మోసం చేసింది. 'బద్రి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అమీషా పటేల్ ఈ మోసానికి పాల్పడ్డారు. దీంతో ఆమె కోర్టులో లొంగిపోయారు. ఆమె జార్ఖండ్ రాష్ట్రంలోని ఓ కోర్టులో లొంగిపోయారు. సినిమా ప్రొడక్షన్ పేరిట అమీషా పటేల్ తన నుంచి రూ.2.50 కోట్లను అప్పుగా తీసుకుని, తన డబ్బు ఎగ్గొట్టారంటూ నిర్మాత, వ్యాపారవేత్త అయిన అజయ్ కుమార్ రాంచీ కోర్టును ఆశ్రయించారు.
పైగా, తన వద్ద తీసుకున్న డబ్బులతో సినిమాను పూర్తి చేయకపోగా, తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని అసలు రూ.2.5 కోట్లకు వడ్డీ రూ.50 లక్షలు అయిందని, అందువల్ల తనకు మొత్తం రూ.3 కోట్లు చెల్లించేలా అమీషా పటేల్‌ను ఆదేశించాలని అజయ్ కుమార్ కోర్టును కోరారు.
నిర్మాత పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న రాంచీ కోర్టు ఏప్రిల్ 6వ తేదీన అమీషా పటేల్‌పై వారెంట్ జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆమె శనివారం కోర్టుకు న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు.
కాగా, కోర్టు వెలువల మీడియా హడావుడిన చూసిన అమీషా పట్లే ముఖం కనిపించకుండా ముసుగు ధరించి కారెక్కి గుట్టు చప్పుడు కాకుండా వెళ్లిపోయారు. కాగా, పవన్ కళ్యాణ్ నటించిన బద్రి చిత్రంలో అమీషా పటేల్ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే.