Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలపై రూ.4 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు దేవక్క లొంగుబాటు..

nellore sp
, బుధవారం, 2 నవంబరు 2022 (09:19 IST)
మావోయిస్టు దేవక్క జనజీవన స్రవంతిలోకి కలిసిపోయారు. ఆమె తాజాగా లొంగిపోయారు. నెల్లూరు జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఆమె తలకు రూ.4 లక్షల రివార్డును గతంలోనే ఉంది. 1984లో ఆమె భర్తతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిన దేవక్క.. 1987లో కాకినాడ పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత ఏపీకి చెందిన ఒక ఐఏఎస్ అధికారిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఆమెను విడిపించుకున్నారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉంటూ వచ్చిన ఆమె తాజాగా నెల్లూరు జిల్లా ఎస్పీ విజయారావు ఎదుట లొంగిపోయారు. ఆమెపై పది కేసులతో పాటు రూ.4 లక్షల రివార్డు కూడా వుంది. 
 
ఇదిలావుంటే, గుంటూరు జిల్లా తాడికొండ ప్రాంతానికి చెందిన దేవక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎల్లవరం దళంలో ఏరియా కమిటీ సభ్యులాలిగా పని చేశారు. సీపీఐఎంఎల్, డీడబ్ల్యూజీ (మావోయిస్టు), తూర్పు డీవీసీ తదితర దళాల్లో పని చేశారు. గత 1974లో నెల్లూరు కావలి మండలం సత్యవోలు అగ్రహారానికి చెందిన రమోజు నరేంద్ర అలియాస్ సుబ్బన్నను ఆమె వివాహం చేసుకున్నారు. 
 
మావోయిస్టు సమావేశాలకు ఆర్థిక అవసరాలతో పాటు వైద్య అవసరాలకు దేవక్క తనవంతు సహకారం అందించారు. 2018లో దేవక్క భర్త చనిపోయారు. ఆమె లొంగుబాటు సందర్భంగా జిల్లా ఎస్పీ విజయారావు మాట్లాడుతూ, ఆమె తలపై రూ.4 లక్షల రివార్డు ఉందని, దాన్ని ఆమెకే అందిస్తామన్నారు. అలాగే, చట్టప్రకారం ఇతర సౌకర్యలాను కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి అప్పు తీసుకోనిదే పూట గడవడం లేదు.. మరో రూ.1413 కోట్ల రుణం