Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఇద్దరి లోకం ఒకటే’కి ఇన్స్పిరేష‌న్ ఏ సినిమానో తెలుసా..?

Webdunia
శుక్రవారం, 6 డిశెంబరు 2019 (19:31 IST)
యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌, షాలిని పాండే జంటగా రూపొందిన లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఇద్దరి లోకం ఒకటే’. స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్ ఈ సినిమాని నిర్మించారు. జీఆర్‌.క ష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ను పొందింది. క్రిస్మస్‌ సందర్భంగా సినిమాను డిసెంబర్‌ 25న విడుదల చేస్తున్నారు.
 
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో దిల్ రాజు చిత్ర విశేషాల‌ను తెలియ‌చేసారు. ఇంత‌కీ ఏం చెప్పారంటే.. 2019 సంక్రాంతికి ఎఫ్‌2, సమ్మర్‌లో మహర్షి వంటి బ్లాక్‌బస్టర్స్‌ సాధించాం. ఈ ఏడాది నాలుగైదు సినిమాలు ఉంటాయనుకున్నాం. కానీ ఈ ఏడాది మూడు సినిమాలతోనే ముగిస్తున్నాం. మూడో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. డిసెంబర్‌ 25 క్రిస్మస్‌ రోజున ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. 
 
దర్శకుడు జీఆర్‌.కృష్ణ ఓ టర్కీ సినిమా చూసిన ఆ ఐడియాను నాకు చెప్పాడు. అక్కడ నుండి మన నెటివిటీకి తగిన విధంగా కథను డెవలప్‌ చేశాం. ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ. చిన్నప్పట్నుంచి హీరో, హీరోయిన్‌ మధ్య ఇంటిమెసీ ఎలా ఉంటుంది? ఇద్దరూ అనుకోకుండా విడిపోయి.. ఎలా కలిశారు? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? అనేది కథ.

ఈ సినిమా కథ తెలుసుకున్న రాజ్‌తరుణ్‌ నన్ను వచ్చి కలిసి ‘సార్‌! కథ బావుందని విన్నాను. నేను చేస్తానండి’ అన్నాడు. అలా సినిమా మొదలైంది. ఖ‌చ్చితంగా డిసెంబర్‌ 25 వచ్చే ‘ఇద్దరి లోకం ఒకటే’ అందరికీ నచ్చుతుంది” అన్నారు. అదీ.. సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments