Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్ద‌రి లోకం ఒక‌టే చిత్రం విడుద‌ల తేదీ ఖ‌రారు

Advertiesment
Iddari Lokam okate movie release date confirmed
, బుధవారం, 4 డిశెంబరు 2019 (20:46 IST)
యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్నల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. డిసెంబ‌ర్‌లో ఈ మూవీని రిలీజ్ చేయనున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.
 
అయితే.. వెంకీమామ రిలీజ్ డేట్ పైన క్లారిటీ రావ‌డంతో ఈ సినిమాపై కూడా క్లారిటీ వ‌చ్చింది. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ మూవీని డిసెంబ‌ర్ 25న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. ఆయ‌న ఈ సినిమా గురించి ఏం చెప్పారంటే...  “మా బ్యాన‌ర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది. క్యూట్ ల‌వ్ స్టోరీ. యూత్‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాను డైరెక్ట‌ర్ కృష్ణ తెర‌కెక్కించారు.
 
ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన రెండు పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌లు, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న సినిమాను విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు. మ‌రి.. స‌రైన స‌క్స‌స్ కోసం త‌పిస్తున్న రాజ్ త‌రుణ్‌కి ఈ సినిమా అయినా విజ‌యాన్ని అందిస్తుందో లేదో..?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెరైటీ టైటిల్‌తో వ‌స్తున్న నాని, ఏంటా టైటిల్?