Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఇందువదన’లో ఫ‌ర్నాజ్ శెట్టి లుక్

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (12:16 IST)
Farnaz Shetty
శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం ఇందువదన. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్‌ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్  కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. విడుదలైన క్షణం నుంచే ఇందువదన లుక్‌కు మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉండటమే కాకుండా, వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ సినిమాలో వ‌రుణ్ సందేశ్ పోషిస్తున్న వాసు పాత్ర‌కి సంబంధించిన లుక్ విడుద‌లైంది, 
 
అలానే ఫ‌ర్నాజ్ శెట్టి పోషిస్తున్న ఇందు పాత్రకి సంబంధించిన లుక్ కూడా టీమ్ ఇందువ‌ద‌న విడుద‌ల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే పూర్తియింది, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. హైద‌రాబాద్ సార‌ధి స్టూడియోస్ లో భారీగా వేసిన సెట్స్ లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. ఈ సినిమాకు కథ, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, బి మ‌ర‌ళికృష్ణ సినిమాటోగ్రాఫి బాధ్య‌త‌లు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.
ఇంకా ఈ సినిమాలో రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), అ౦బఋషి,జెర్సీ మోహన్ తదితరులు న‌టిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments