Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

‘ఇందువదన’నను జాకెట్ లేకుండానే కౌగలించుకున్న హీరో, ప్రేక్షకులు ఏం చేస్తారో?

Advertiesment
Varun sandesh
, సోమవారం, 3 మే 2021 (14:00 IST)
Induvadana First look
గేప్ వ‌స్తే అమెరికా, క‌థ కుదిరితే హైద‌రాబాద్ రిట‌ర్న్‌. అందుకు ఇప్పుడు క‌థ ల‌భించింది కాబట్టి హైద‌రాబాద్‌లో ఓ ఫ్లాట్ తీసుకుని వుంటున్నాడు హీరో. ఆయ‌నే వరుణ్ సందేశ్. ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా సినిమా తీసి ముందుకు వ‌చ్చేశాడు. ఈలోగా క‌రోనా సెకండ్‌వేవ్ రావ‌డంతో రిలీజ్‌కు గేప్ వుండ‌డంతో ప్ర‌చారానికి సిద్ధ‌మ‌య్యాడు. చాలా వినూత్నంగా ఓ గెట‌ప్ వేసి టైటిల్‌కూడా అంతే రీతిలో పెట్టాడు. మెగాస్టార్ న‌టించిన సినిమాలోని సూప‌ర్‌హిట్‌ పాట అయిన `ఇందువంద‌న కుంద‌ర‌ద‌న‌.`లోని పాట‌ను తీసుకుని `ఇదువంద‌న` అనే టైటిల్ పెట్టారు.
 
శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై  నైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో MSR దర్శకత్వం వ‌హిస్తున్న‌, శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం 'ఇందువదనస‌. వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి ఇందులో జంటగా నటిస్తున్నారు. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. తాజాగా విడుదలైన ఇందువదన ఫస్ట్ లుక్‌ చాలా కళాత్మకంగా ఉండటంతో అనూహ్యమైన స్పందన వస్తుంది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ కథాపరంగా చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. విడుదలైన క్షణం నుంచే ఇందువదన లుక్‌కు మంచి స్పందన వస్తున్నందుకు చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉండటమే కాకుండా,వరుణ్ సందేశ్ కూడా ఇందువదన సినిమా కోసం తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. 
 
ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందిస్తుండగా శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.
 
నటీనటులు: 
వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్ తదితరులు
 
టెక్నికల్ టీం: 
దర్శకుడు: MSR
బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్
స‌మ‌ర్ప‌ణ:  నైనిష్య & సాత్విక్
నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి
కో. ప్రొడ్యూసర్: గిరిధర్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సతీష్ ఆకేటి 
సంగీతం: శివ కాకాని
కో డైరెక్టర్: ఉదయ్ రాజ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఆర్ట్: వై నాగు
లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన
లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓట్ల‌తో ఓడినా విలువ‌ల‌తో గెలిచిన హీరోలు!