తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి పట్టుకొమ్మ లేకుండా అంచలంచెలుగా మెగాస్టార్ రేంజ్‌కు చేరుకున్న హీరో చిరంజీవి. ఇపుడు సినీ ఇండస్ట్రీకే పెద్ద దిక్కుగా మారాడు. అందుకే చిరంజీవి అనేక అనేక మంది స్ఫూర్తి, ప్రేరణ. ఆయనలా కష్టపడుతూ ఒక్కో మెట్టుపైకెక్కుతూ రావాలని ఆశపడుతారు. అంతేనా... తన డ్యాన్సులో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ విప్లవమే తీసుకొచ్చాడు. ఫలితంగా కోట్లాడి మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు.
ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేయాలంటే కథానాయికల గుండెళ్లో రైళ్ళు పరిగెత్తేవి. బ్రేక్ డ్యాన్స్‌ని తొలిసారి టాలీవుడ్‌కు పరిచయం చేసి హీరో మెగాస్టారే. అందుకే ఆయన స్టైల్‌లో డ్యాన్స్ చేయాలని జూనియర్ డ్యాన్సర్లు ఆశపడుతుంటారు. ఇప్పటికే మెగా కాంపౌండ్‌కు చెందిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమాలలో మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్స్‌ని అనుకరిస్తూ డ్యాన్స్ చేసి ప్రశంసలు పొందుతున్నాడు.
అయితే, శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం ద్వారా హీరోగా పరిచయమై... ‘కుందనపు బొమ్మ, ఉందిలే మంచికాలం ముందు ముందునా, నువ్వు తోపురా’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన కుర్ర హీరో సుధాకర్ కోమాకుల.
ఈయన తాజాగా ‘ఇందువదన..’ పాటకు డ్యాన్స్ చేశారు. తన భార్య హారికతో కలిసి ‘ఛాలెంజ్’ చిత్రంలోని ‘ఇందువదన కుందరదన.. ఐ లవ్ యు ఓ హారిక... నీ ప్రేమకే జోహరిక’ పాటను.. రీ క్రియేట్ చేసి మెగా ఫ్యాన్స్ మెప్పు పొందుతున్నారు.
ఐ ఫోన్ లో.. ట్రైపాడ్ ఉపయోగించి, తన మిత్రుడు జార్జ్ సంపర సహకారంతో దీనిని చిత్రీకరించినట్టు సుధాకర్ పేర్కొన్నాడు. ఆదిత్య మ్యూజిక్ తమ అఫీషియల్ యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ని అప్లోడ్ చేయడం గమనార్హం.