Webdunia - Bharat's app for daily news and videos

Install App

శర్వానంద్ పుట్టినరోజు.. కాజల్‌తో రొమాన్స్.. సమంతతో ''జాను''

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (18:35 IST)
పడిపడి లేచె మనసు తర్వాత శర్వానంద్ నటిస్తోన్న సినిమా గురించి అప్‌డేట్స్ వచ్చేశాయి. టాలీవుడ్ నటుడు శర్వానంద్, కాజల్ కాంబినేషన్‌లో సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మార్చి ఆరో తేదీన శర్వానంద్ పుట్టిన రోజు కావడంతో తాజాగా ఈ చిత్రం నుంచి శర్వానంద్ కొత్త లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఈ లుక్‌లో శర్వానంద్ గడ్డంతో స్టైలిష్‌గా వున్నాడు. 
 
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ శర్వానంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ లుక్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ శర్వానంద్ 27వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్టు మేలో విడుదల కానుంది.
 
ఇకపోతే.. విజయ్ సేతుపతి ,త్రిష జంటగా నటించిన ''96'' రీమేక్‌లో యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా నటించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రేమ్ కుమార్ తెరకెక్కించనున్నాడు. కాగా ఒరిజినల్ వెర్షన్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహించాడు. 
 
అలాగే ఈ చిత్రానికి 'జాను' అనే టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం. మొదటి సారి శర్వా -సమంత జంటగా నటించనుండడం అలాగే దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments