జానకిదేవిగా రానున్న సమంత.. భర్తకు ఎందుకు థ్యాంక్స్ చెప్పింది?

సోమవారం, 4 మార్చి 2019 (15:06 IST)
టాలీవుడ్ స్టార్స్ సమంత, శర్వానంద్ జంటగా 96 రీమేక్‌లో నటించనున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో.. తెలుగులోకి రీమేక్ అవుతోంది. ఈ సినిమాను రీమేక్ చేసేందుకు దిల్ రాజు సిద్ధమయ్యారు. తెలుగు నేటివిటికీ తగినట్లు ఈ కథలో చిన్నచిన్న మార్పులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం టైటిల్ వేట జరుగుతోంది. 
 
జాను, జాను అలియాస్ జానకి అనే రెండు పేర్లను ఈ చిత్రం కోసం టైటిల్‌గా పరిశీలిస్తున్నారు. తాజాగా జానకీదేవి అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించారట. దాదాపు ఇదే టైటిల్‌ను ఖరారు చేయవచ్చునని సమాచారం. ఈ నెల 6వ తేదీన శర్వానంద్ పుట్టినరోజున ఈ సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేయవచ్చునని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ప్రీ ప్రొడక్షన్స్ పనులు పూర్తి చేసుకుని.. ఈ సినిమాను ఏప్రిల్ నుంచి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం అవుతోంది. 
 
ఇకపోతే.. ''మజిలీ'' దర్శకుడు హీరోయిన్ సమంతపై ప్రశంసల జల్లు కురిపించారు. ''మజిలీ'' చిత్రంతో శ్రావ‌ణిగా వ‌స్తున్న స‌మంత మీ అంద‌రిని న‌వ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఆమె అస‌మాన న‌ట‌నని చూసి మీరు షాక్ కావ‌డం ఖాయమంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై సమంత రియల్ హీరో నాగచైతన్య ''అవును నిజమే''.. అంటూ స్పందించారు.
 
ఇక తన తన భర్త ప్రశంసలకు ముగ్ధురాలైన సమంత అక్కినేని రెండు లవ్ సింబల్ ఎమోజీలతో ''థాంక్యూ హజ్బండ్'' అంటూ రొమాంటిక్ ట్వీట్ వదిలింది. ప్రస్తుతం ల‌వ‌బుల్ క‌పుల్ లవ్ మజిలీ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'సాహో' మూవీ 'బాహుబలి' రికార్డును తిరగరాస్తుందా?