కాజల్ అగర్వాల్ ఐ లవ్ యూ పోస్టు.. ఎవరికి చెప్పనుందో?

ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (10:35 IST)
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రేమలో వుందా అంటే అవుననే అంటున్నాయి.. టాలీవుడ్ వర్గాలు. ఎందుకంటే.. కాజల్ అగర్వాల్ రహస్య ప్రేమికుడికి ఐ లవ్యూ చెప్పింది. స్తుతం త‌మిళ‌నాట కమల్ హాసన్ భారతీయుడు 2లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ‌. 
 
తాజాగా కాజ‌ల్ అగ‌ర్వాల్ సోష‌ల్ మీడియాలో పెడుతున్న కొన్ని పోస్టులు మాత్రం కాస్త ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. తాజాగా ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాగ్రౌండ్ క‌ల‌ర్ మాత్ర‌మే ఇచ్చి.. క్విక్ రిమైండర్.. ఐ లవ్ యు అని పోస్ట్ చేసింది. 
 
30 ఏళ్ల... కాజల్ ఇంకా సినీ అవకాశాలను చేతినిండా పెట్టుకుని బిజీ బిజీగా వుంది. ఆ మ‌ధ్య మాత్రం ప్రేమ పెళ్లి మాత్ర‌మే చేసుకుంటాన‌ని.. పైగా ఇండ‌స్ట్రీలో ఉన్న వాళ్ల‌ను మాత్రం చేసుకోన‌ని తెగేసి చెప్పింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఐ లవ్ యూ చెప్పాలని రిమైండ్ పోస్టు చేసింది. దీనిని బట్టి ఆమె ప్రేమలో వున్నట్లు టాక్ వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం దెబ్బేసిన ఎన్టీఆర్ బయోపిక్... క్రిష్ త‌దుప‌రి చిత్రం ఎవ‌రితో..?