Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముద్దుకోసం ఆశపడి ఆ యువకుడు ఏం చేశాడంటే? కిస్ ఛాలెంజ్ ఏమైందంటే?

Advertiesment
Kiss challenge
, గురువారం, 21 ఫిబ్రవరి 2019 (16:50 IST)
ప్రేయసీ ప్రియుల మధ్య సరదా కబుర్లు, గమ్మత్తైన సవాళ్లు, వాటిలో గెలిస్తే బహుమతులు సహజమే. అలాగే ఈ ప్రేయసి కూడా ఓ సవాల్ విసిరింది. ఇందులో గెలిస్తే ముద్దిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంత మంచి ఆఫర్ ఇచ్చాక మనవాడు వెనక్కు తగ్గుతాడా, సై అంటూ ఆమె చెప్పినట్టే చేసాడు.


అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో స్థానికులకు అనుమానమొచ్చి పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారట. ముద్దు కోసం ఆశపడితే ఇలా కటకటాల వెనుకకు వెళ్లాల్సి వచ్చింది.
 
తమిళనాడులోని పట్టాభిరామ్‌‌కి చెందిన 22 ఏళ్ల శక్తివేల్‌ అన్నాసాలైలో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉద్యోగ శిక్షణలో ఉండగా స్థానికంగా ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో ప్రేమికుల రోజున ముద్దు కావాలని ఆమెను అడగగా అందుకు ప్రేయసి ఒప్పుకోలేదట. బుంగమూతి పెట్టిన ప్రియుడిని చూసి కరిగిపోయి బురఖా ధరించి రాయపేట నుంచి మెరీనా బీచ్‌ వరకు వస్తే ముద్దిస్తానని చెప్పింది. 
 
ఇక ఆమె చెప్పిందే తడవుగా శక్తివేల్‌ బురఖాతో ప్రియురాలి ఇంటికి వచ్చాడు. అక్కడి నుండి ఆమెతో కలిసి మెరీనా బీచ్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న స్థానికులు శక్తివేల్ నడకతో పాటు, మగవాళ్ల చెప్పులు ఉండటంతో అనుమానపడి పట్టుకుని చితకబాది, పోలీసులకు అప్పగించగా, పోలీసు విచారణలో శక్తివేల్ ఈ విషయాలను వెల్లడించాడు. ఏదో ఆశపడితే ఏదో జరిగినట్లు తయారైంది పరిస్థితి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గల్ఫ్ దేశంలో పెళ్లితో ఒక్కటయ్యారు, మరి స్వదేశానికి వచ్చి ఏంటీ పని?