Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీటూపై స్పందిస్తా.. పోకిరి చిత్రం అలా నిలిచిపోయింది : ఇలియానా

Webdunia
సోమవారం, 12 నవంబరు 2018 (09:56 IST)
టాలీవుడ్ మాస్ మ‌హారాజా రవితేజ, ఇలియానా జంటగా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై శ్రీనువైట్ల దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, చెరుకూరి మోహన్‌(సి.వి.ఎం) నిర్మిస్తోన్న చిత్రం "అమర్‌ అక్బర్‌ ఆంటొని". ఈ చిత్రం నవంబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విడుదల దగ్గరపడడంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ ఇలియానా మీడియాతో ముచ్చటించారు. 
 
ఈ సమావేశంలో చిత్ర విశేషాలతో పాటు తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదో కూడా ఇలియానా తెలిపింది. ముఖ్యంగా మీటూపై ఆమె స్పందిస్తూ, 'స్త్రీ కావచ్చు.. పురుషుడు కావచ్చు. ఎవరైనా లైంగిక వేధింపులను అనుభవించిన వ్యక్తి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పడం చాలా మంచి విషయం. ఇది ఒక భయానిక అనుభవం. ఎవరో ఒకరు ముందుకు వస్తేనే ఇలాంటి సమస్యలు తీరుతాయి. లేదంటే ఇటువంటి పరిస్థితులు అన్ని చోట్లా ఉదృతం అవుతాయి. ఇలాంటి సమస్యపై నేను స్పందించాల్సిన సమయంలో ఖచ్చితంగా స్పందిస్తాను' అని చెప్పుకొచ్చింది. 
 
ఉదాహరణకు 'పోకిరి' సినిమా చేసేటప్పుడు అది అంత పెద్ద హిట్‌ అవుతుందని నేను ఊహించలేదు. నేను పోకిరి చేయకూడదని అనుకుంటున్న సమయంలో మంజులగారు నాతో మాట్లాడి ఒప్పించారు. నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా పోకిరి నిలిచింది. అలా కొన్ని సినిమాలు నేను ఇష్టపడి చేసినవి.. నిరాశ పరిచాయి. అన్నింటి నుంచి ఎంతో కొంత నేర్చుకుంటూనే వెళుతున్నాను' అని ఇలియానా చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం