Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెటిలర్స్‌ను నాన్‌లోకాల్ అని అనలేదే..? కళాకారులు యూనివర్సల్ స్టార్స్ : ప్రకాష్ రాజ్

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (12:13 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి సినీ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీపడుతున్నారు. దీంతో ఆయన నాన్ లోకల్ అంటూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. వీటికి ప్రకాష్ రాజ్ ఘాటుగానే స్పందించారు. సినీ ప‌రిశ్ర‌మ‌లో అంద‌రూ అంద‌రికీ కావాల్సిన వారేన‌ని చెప్పారు. త‌న‌ను లోక‌ల్.. నాన్ లోకల్ అంటూ కొందరు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని, క‌ళాకారులంద‌రూ లోక‌ల్ కాద‌ని యూనివ‌ర్స‌ల్ అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అవార్డులు వ‌చ్చిన‌ప్పుడు నాన్ లోక‌ల్ అనే ప్ర‌స్తావ‌న ఎందుకు రాలేదు? నవనందులు తీసుకున్నపుడు ఈ ప్రస్తావన ఏ ఒక్కరూ లేవనెత్తలేదని ప్రకాశ్‌ రాజ్ గుర్తుచేశారు. అంతఃపురం చిత్రానికి జాతీయ అవార్డు వచ్చినపుడు నేను లోకల్.. ఇపుడు నాన్ లోకలా అని ప్రశ్నించారు. తెలంగాణాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. నా సిబ్బందికి హైదరాబాద్ నగరంలో ఇళ్లు కట్టించి ఇచ్చాను. నా పిల్లలు ఇక్కడే చదవుతున్నారు. నా ఆధార్ కార్డు ఇక్కడిదే. మరి ఇన్నివుండగా నేను నాన్ లోకల్ ఎలా అవుతాను అని ప్రశ్నించారు. 
 
తెలుగు బిడ్డ విశాల్ తమిళంలో హీరోగా రాణించడం లేదా.? నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందలేదా? మరి విశాల్ అక్కడ లోకల్ అయినపుడు ఇక్కడు నాన్ లోకల్ ఎలా అవుతాను అంటూ నిలదీశారు. ఎన్నికల కోసం తనను నాన్ లోకల్ అంటూ విమర్శించే వారు సంకుచిత మనస్తత్వంతో ఉన్నారని తెలుస్తుందన్నారు.
 
అలాగే, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయాల‌న్న నిర్ణ‌యం ఒక్క‌రోజులో తీసుకున్న‌ది కాదన్నారు. తాను పోటీ చేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యం బాగా ఆలోచించి తీసుకున్న‌ట్లు చెప్పుకొచ్చారు. తాను ఏడాది నుంచి ప్యాన‌ల్ ఏర్పాటుపై ఆలోచ‌న చేసిన‌ట్లు తెలిపారు. ఆవేద‌న‌తో పుట్టిన 'సినిమా బిడ్డ‌ల ప్యాన‌ల్' ఇదని తెలిపారు.
 
కాగా, సెప్టెంబర్‌లో జరగాల్సిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారిన విష‌యం తెలిసిందే. అధ్యక్ష ప‌ద‌వి కోసం ఈ పోటీలో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌, హీరో మంచు విష్ణుతో పాటు జీవితా రాజశేఖర్‌, హేమ కూడా నిలబడుతున్నట్టు ప్రకటించడంతో ఈ ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ప్రకాశ్‌ రాజ్ దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ రోజు తన ప్యానల్‌ సభ్యులతో క‌లిసి మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments