Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవిడ్ క‌ష్ట‌కాలంలో బాస‌ట‌గా నిలుస్తోన్న హోంబ‌లే ఫిలింస్

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (19:11 IST)
Vijay, prasanth, prabhas
ప్ర‌భాస్‌తో `స‌లార్‌` సినిమా నిర్మిస్తోన్న హోంబ‌లే ఫిలింస్ రెండు కోట్ల‌తో కోవిడ్ బాధితుల‌ను ఆదుకుంటోంది. అదెలాగంటే, క‌రోనా బారిన ప‌డిన వారు హాస్పిట‌ల్స్‌లో బెడ్స్ అందుబాటులో లేకుండా, ఆక్సిజ‌న్ అంద‌క ఇక్క‌ట్ల‌కు గుర‌వుతున్నారు. ఈ పాండ‌మిక్ స‌మ‌యంలో సినీ రంగం కూడా క‌ష్ట న‌ష్టాల‌ను భ‌రిస్తోంది. సినిమా షూటింగ్స్‌, రిలీజ్‌లు ఆగిపోయాయి. ముఖ్యంగా సినీ కార్మికులు చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇది మ‌నంద‌రికీ ప‌రీక్షా స‌మ‌యం..ఇలాంటి స‌మ‌యంలో మ‌నం అందరం ఒక‌రికొక‌రు అండ‌గా నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది అనే ఆలోచ‌న‌తో సినీ కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌టానికి ముంద‌డుగు వేసింది ఇండియాలోని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన హోంబ‌లే ఫిలింస్‌.
 
హోంబలే సంస్థ...రెండు కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి క‌ర్ణాట‌క‌లోని మాండ్య ప్రాంతంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్స్‌, 20 ఆక్సిజ‌న్ బెడ్స్‌ను ఏర్పాటు చేసింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖ‌ల్లోని 3200 మంది స‌భ్యుల‌కు రూ.35 ల‌క్ష‌లను సాయాన్ని అందించింది హోంబలే నిర్మాణ సంస్థ. అంతే కాకుండా హోంబలే నిర్మాణ సంస్థ‌లో రూపొందుతోన్న ‘స‌లార్’ సినిమా కేవలం పది రోజుల చిత్రీకరణను మాత్రమే పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఆ సినిమా కోసం పని చేస్తున్న 150 మంది యూనిట్ స‌భ్యుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికీ రూ.5000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. గత ఏడాది పాండిమిక్ స‌మ‌యంలోనూ 350 మంది సినీ కార్మికుల‌కు ఒక్కొక్క‌రికీ రూ.5000 వేల ఆర్థిక సాయాన్ని రెండు నెల‌ల పాటు అందించి బాసటగా నిలిచింది హోంబ‌లే నిర్మాణ సంస్థ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కలివి కోడిని కనుక్కునేందుకు రూ. 50 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వాలు

బంగారు పీఠం తప్పిపోయింది.. ఉన్ని కృష్ణన్ ఇంట్లో దొరికింది.. అసలేం జరుగుతోంది?

Election : అక్టోబర్ 9 నుండి 31 జిల్లాల్లో పోలింగ్- మార్గదర్శకాలు జారీ

నా మిత్రుడు పవన్ కల్యాణ్ ఎలాంటివారో తెలుసా?: సీఎం చంద్రబాబు (video)

Lady Aghori: అఘోరి కుక్కలాగ వాగితే నేను విని సైలెంట్‌గా ఉండాలా? దాన్ని కోసేస్తా: వర్షిణి స్ట్రాంగ్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments