ఫరెవర్ డిజైరబుల్ క్లబ్ పేరుతో టైమ్స్ సంస్థ ఇచ్చే అవార్డుకు ప్రభాస్‌ను ఎంపికచేయనున్నట్లు సమాచారం. 2020కుగాను ఈ జాబితాను త్వరలో ప్రకటించనున్నారు. అదేవిధంగా మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో 2020కు గాను విజయ్‌దేవర కొండ కు ఇచ్చినట్లు ప్రకటించింది. అదేవిధంగా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఎవరనేది కొద్ది గంటల్లో టైమ్స్ ప్రకటించనుందని తెలుస్తోంది. ఇటీవలే సమంత నటించిన ఫ్యామిలీమెన్2 సినిమా తమిళనాడు పెద్ద గొడవ జరిగింది. అందులో ఆమె పాత్ర తమిళుల మనోభావాలను దెబ్బతీసేదిగా వుందని ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. దానితోపాటు పాన్ ఇండియా శాకుంతలం కూడా ఆమె చేస్తోంది.
ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో టాప్ స్థానంలో నిలుస్తున్న కొందరికి మాత్రమే ఫరెవర్ డిజైరబుల్ క్లబ్ లో చోటుంటుంది. ఈ క్లబ్‌లో చోటు దక్కినవాళ్ల పేర్లు మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో ఉండదు. ఈ జాబితాలో ఇప్పటివరకు టాలీవుడ్ నుండి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు ఇప్పటికే ఇందులో చోటు దక్కించుకోగా గత ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు పేరును అందులో చేర్చారు. ఇక తాజాగా 2020 సంవత్సరానికిగాను రెబల్ స్టార్ ప్రభాస్ పేరును కూడ ఆ లిస్టులో చేర్చారు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తమైంది. ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రతి ఇండస్ట్రీలోనూ ఆయనకు అభిమానులు పెరుగారు. ప్రజెంట్ ప్రభాస్ రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలు చేస్తున్నారు. ఇవి కంప్లీట్ కాగానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాను కూడా చేయనున్నారు.