Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఆదిపురుష్' కోసం రూ.50 కోట్ల రెమ్యునరేషన్?

Advertiesment
'ఆదిపురుష్' కోసం రూ.50 కోట్ల రెమ్యునరేషన్?
, శనివారం, 5 జూన్ 2021 (17:36 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుహలి' చిత్రం తర్వాత టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన  ప్రభావ్ ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిపోయారు. ఈ చిత్రం తర్వాత ఆయన చసే ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా సినిమాలే. తాజాగా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. 
 
వాటిలో ఒకటి "రాధేశ్యామ్". ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇదికాకాకుండా, ప్రశాంత్‌ నీల్‌తో 'సలార్'‌,  ‘తన్హాజీ’ ఫేం ఓం రౌత్‌తో "ఆదిపురుష్‌" చిత్రం షూటింగ్‌ దశలో ఉన్నాయి. ఆ తర్వాత డైరెక్టర్‌ నాగ అశ్విన్‌తో ఓ సినిమా సెట్స్‌పైకి రావాల్సి ఉంది. 
 
ఇదిలావుంటే, తాజాగా ప్రభాస్‌ "ఆదిపురుష్‌''కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీని టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తుంది. 
 
అయితే 'ఆదిపురుష్‌' కోసం టీ-సిరీస్‌ ఫిల్మ్స్‌ ప్రభాస్‌కు రూ.50 కోట్లను పారితోషికంగా ఇస్తున్నట్లు సమాచారం. పౌరాణిక నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా నటించనుంది. ఇకపోతే, లంకేశ్వరుడు రావణుడి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ అలరించనున్నాడు. 
 
భారీ బడ్జేట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. 2022 అగష్టు 11ను ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్జీవీకి కనెక్టయిన యాంకర్, ఆ వర్కవుట్లు చేస్తూ?