Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్జీవీకి కనెక్టయిన యాంకర్, ఆ వర్కవుట్లు చేస్తూ?

Advertiesment
ఆర్జీవీకి కనెక్టయిన యాంకర్, ఆ వర్కవుట్లు చేస్తూ?
, శనివారం, 5 జూన్ 2021 (17:09 IST)
ఫిమేల్ యాంకర్లకు తప్ప నేనెవరికీ ఇంటర్వ్యూలను ఇవ్వను. ఇచ్చినా ఓపిగ్గా సమాధానం చెప్పను. కాబట్టి దొబ్బెయ్యండి అంటూ బాహాటంగా బరితెగించి చెప్పే రాంగోపాల్ వర్మ అందుకు తగ్గట్లే చేస్తూ సంచనలంగా మారుతున్నారు. ఇంత అందాన్ని నేను ఎక్కడా చూడలేదు. 
 
మీరు టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు ఓకే అంటే మిమ్మల్ని పెట్టి సినిమా తీస్తా. మిమ్మల్ని చూస్తూ కూర్చోవడానికి ఇంటర్వ్యూకు ఒకే అన్నాను. మీరు నాకు నయనానందం కలిగిస్తున్నారు. ఈసారి ఇంకొంచెం ఎక్కువగా నయనాందం కలిగించాలని కోరుకుంటున్నాను అంటూ ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చే యాంకర్లను ఫ్లాట్ చేస్తూ మహదానందం పొందుతుంటాడు ఆర్జీవీ.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

అందుకు తగ్గట్లే యాంకర్లు కూడా ఈ డైరెక్టర్ మాటలకు మురిసిపోతూ కెరీర్ బాగుండాలని ట్రై చేస్తూ ఉంటారు. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి ఫేమస్ అయ్యారు అరియానా. అప్పటివరకు అంతగా ఎవరికీ తెలియని ఈ బ్యూటీ ఆర్జీవీ చేసిన కొన్ని కామెంట్లతో ఓవర్ నైట్లో పాపులరై అప్పటి నుంచి నేరుగా బిగ్ బాస్ షోకి వెళ్ళి అదరగొట్టారు.
 
ఇక ఇప్పుడు మరోసారి ఇంటర్వ్యూ అంటూ వచ్చి వర్మతో ఏకంగా వర్కవుట్లు చేసేశారు. అంతేకాకుండా డిఫరెంట్ యాంగిల్స్ విత్ డంబుల్స్‌తో ఫోటోలకు ఫోజులిస్తూ మరీ ఫోటోలను పోస్టులు చేశారు. ఇక ఫోటోలను చూసిన ఆర్జీవీ అభిమానులు అరియానా కనెక్టయ్యిందంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారట. అంతేకాదు ఆర్జీవీ నెక్ట్స్ మూవీలో హీరోయిన్ అరియానా అంటున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాడే స్థాయి నుంచి జ‌డ్జిగా ఎదిగిన సునీత‌