Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు నా పుట్టిన రోజు కాదు. ఇది నిజానికి నా డెత్ డే. ఎందుకో తెలుసా? రామ్ గోపాల్ వర్మ

నేడు నా పుట్టిన రోజు కాదు. ఇది నిజానికి నా డెత్ డే. ఎందుకో తెలుసా? రామ్ గోపాల్ వర్మ
, బుధవారం, 7 ఏప్రియల్ 2021 (11:10 IST)
వివాదాలు కేరాఫ్ అడ్రెస్ ఆయన.. ఆయన పేరు ఓ సంచలనం. ముక్కుసూటి తనం ఆయన నైజం ఆయన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. కింగ్ నాగార్జున తో కలిసి వర్మ తెరకెక్కించిన శివ సినిమా టాలీవుడ్‌లో హిస్టరీని క్రియేట్ చేసింది. అసలు సిసలైన మాస్ యాక్షన్‌ను ఆడియన్స్‌కు రుచిచూపించాడు వర్మ. అలాగే వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉన్నట్టే.. ఉన్నది ఉన్నట్టు చెప్పడం సినిమాల్లో చూపించడం ఆర్జీవీ స్టైల్. కరోనా లాక్ డౌన్ సమయంలో వర్మ ప్రేక్షకులను తన సినిమాలతో అలరించారు. వరుసగా ఓటీటీ వేదికగా సినిమాలను రిలీజ్ చేశారు ఆర్జీవీ.
 
ఇక ఆర్జీవీ దగ్గర దర్శకత్వంలో శిష్యరికం చేసిన ఎంతో మంది ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌గా రాణిస్తున్నారు. వర్మను తిట్టేవాళ్ళు ఎంతమందున్న ఆయనను ఇష్టపడేవాళ్లు కూడా అంతే ఉన్నారు. ఆర్జీవీ అంటే ఆయన సినిమాలకంటే ముందు కాంట్రవర్సీలు గుర్తొస్తాయి. సినిమాలను పబ్లిసిటీ చేసుకోవడంలో వర్మ స్టైలే వేరు. అంతే కాదు ఆయన రాజకీయ నాయకుల మీద సినిమా పెద్దల మీద వర్మ చేసే కామెంట్స్ ఎప్పుడు హాట్ టాపిక్స్.
 
సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథతో సినిమా చేసి పెద్ద దుమారాన్నే రేపాడు ఆర్జీవీ. లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కించి నిజమైన బయోపిక్ అంటూ కామెంట్లు చేశారు వర్మ. ఆతర్వాత దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన పైన కూడా వర్మ సినిమా తీసాడు. అలాగే మిర్యాల గూడలో జరిగిన పరువు హత్య నేపథ్యంలోనూ సినిమాను తీసాడు వర్మ. 
 
ఇక ఎందరో ఆశావాదులకు రోల్ మోడల్ గా నిలిచే ది గ్రేట్ రామ్‌గోపాల్ వర్మ పుట్టిన రోజు నేడు. ఆయన పుట్టిన రోజును కూడా వెరైటీగా పబ్లిసిటీ చేసుకుంటారు వర్మ.  రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజును ప్రతి ఒక్కరూ ఆయనకు శుభాభినందనలు తెలుపుతున్న వేళ, తనదైన శైలిలో కామెంట్ చేస్తూ, ట్విట్టర్లో వర్మ పెట్టిన ఓ కామెంట్ వైరల్ అయింది. టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులతో పాటు, ఫ్యాన్స్ ఆయనకు విషెస్ చెబుతూ ఉన్న వేళ, ఆయన ఓ కొంటె కామెంట్ చేశారు.
 
"నేడు నా పుట్టిన రోజు కాదు. ఇది నిజానికి నా డెత్ డే. ఎందుకో తెలుసా? నా ఆయుష్షులో మరో సంవత్సరం తగ్గిపోయింది" అంటూ ఈ ఉదయం ఆయన ట్వీట్ చేశారు. దీనికి ఏడుపు మొహం ఎమోజీని సైతం తగిలించారు. వర్మ ట్వీట్ ను చూసిన పలువురు వెరైటీగా స్పందిస్తున్నారు. ఆర్జీవీ రూటే సపరేటని కామెంట్లు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా సోకింది.. 2 వారాలు ఫోన్లు చేయొద్దు : విజయేంద్ర ప్రసాద్