Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమ‌ర్శ‌లు అల‌వాట‌య్యాయిః ర‌ష్మిక‌

Advertiesment
విమ‌ర్శ‌లు అల‌వాట‌య్యాయిః ర‌ష్మిక‌
, సోమవారం, 5 ఏప్రియల్ 2021 (18:43 IST)
Rahimka
న‌టీన‌టుల‌కు విమ‌ర్శ‌లు మామూలే. ఆ మ‌ధ్య బెంగుళూరు శివార్లో వున్న త‌న ఇంటిలో ఐ.టి. దాడులు జ‌రిగాయి. స‌రిగ్గా లెక్క‌లు చూప‌లేద‌నీ విమ‌ర్శ‌. ఆ త‌ర్వాత స‌మ‌స్య సాల్వ్ అయింది. ఇలా కొన్ని ర‌కాల కామెంట్ల‌కు కొత్త‌లో కొంచెం ఇబ్బందిగా వుండేద‌నీ, రానురాను అల‌వాటు అయిపోయాయ‌నీ, నాకు నాబ‌లం నా త‌ల్లిదండ్ర‌లేన‌ని అంటోంది ర‌ష్మిక‌. కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన మదన్‌, సుమన్‌ దంపతులకు 1996 ఏప్రిల్‌ 5న రష్మిక జన్మించింది. రష్మికకు శిమన్‌ అనే చెల్లి ఉంది. చిన్నప్పటి నుంచి రష్మికకు తండ్రి మదన్‌ అంటే ఎంతో ఇష్టం.
 
పుట్టిన‌రోజున సంద‌ర్భంగా ఓ మ‌ల‌యాళ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూ చేసింది. ఆమె న‌టించిన క‌న్న‌డ కిట్టీపార్టీ  అనుభ‌వాలు తెలియ‌జేయ‌మంది. ఆ సినిమా ద్వారానే ఆమె వెలుగులోకి వ‌చ్చింది. అందులో సెక్స్ గురించి వున్న అంశాన్ని చెప్ప‌మ‌న‌గా.. మీ విష‌యం నాకు ఎలా తెలుస్తుంద‌నేలా చ‌లోక్తి విసిరి తెలివిగా దాట వేసింది. సినిమాను సినిమాప‌రంగా చూడాలంటూ చుర‌క వేసింది.
 
webdunia
Rashmika exercise
తాజాగా ఆమె న‌టించిన సినిమా `సుల్తాన్‌`. కార్తి స‌ర‌స‌న న‌టించింది. ఈ సినిమాలో చాలా చిక్కిపోయిన‌ట్లు అనారోగ్యం పాల‌యిన‌ట్లు క‌నిపించింది. కానీ త‌న ఇస్స్ర‌టాగ్రామ్‌లో ఆ సినిమాకు సంబంధించిన పొలం ప‌నులు చేస్తున్న స‌న్నివేశం పెట్టింది. ఇది పాత్ర‌ప‌రంగా త‌గ్గాన‌ని అంటోంది.
 
తెలుగులో 2018లో నాగ‌శౌర్య `ఛలో’తో పరిచయమయ్యారు. ‘గీతగోవిందం’ ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘పుష్ప’లో నటిస్తున్నారు. తన మొదటి సినిమా హీరో రక్షిత్‌శెట్టితో రష్మికకు నిశ్చితార్థమైన విషయం తెలిసిందే. కాకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరూ విడిపోయారు. దాంతో టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోతో రష్మిక ప్రేమలో ఉందని అందరూ చెప్పుకున్నారు. త‌ను ఎంత బిజీగా వున్నా క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వర్కౌట్లు చేస్తూనే వుంటాన‌ని చెబుతోంది. బాడీని త‌గ్గించుకునే క్ర‌మంలో ఇటీవ‌లే మాంసాహారానికి దూరమయ్యాన‌ని అంటోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"వకీల్ సాబ్‌"కు సెన్సార్ సభ్యుల ప్రశంసలు!! - 'యూఏ' సర్టిఫికేట్