Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''పుష్ప'' లేటెస్ట్ అప్డేట్.. కెవ్వుకేక.. శనివారం వరకు వేచి చూడాల్సిందే..!

Advertiesment
PushpaRaj
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఢిపరెంట్ డైరెక్టర్ సుకుమార్ సూపర్ కాంబోలో వస్తోన్న చిత్రం 'పుష్ప'. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. కరోనా సందర్భంగా చాలా లేటుగా ఈ సినిమా ప్రారంభమైంది.
 
ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు.
 
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్, తూర్పు గోదావరి మధ్యలో ఉన్న రంపచోడవంతో పాటు మన్యంతో పాటు ఖమ్మం అడవుల్లో జరిగింది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కొత్త లుక్‌లో పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాడు. తాజాగా ఈ సినిమా యూనిట్‌లో ఒకరికి కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. 
webdunia
Pushpa
 
ఈ సినిమాను ఆగష్టు 13న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో పాటు బన్ని లుక్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ప్రీల్యూడ్ పుష్పరాజ్ అంటూ విడుదల చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

40 గ్రామాలకు చెందిన 300 మంది పేద విద్యార్థులకు ఫోన్లు.. సోనూ సూద్