సమంత వర్కౌట్స్ అభిమానులు ఫిదా
, బుధవారం, 12 మే 2021 (19:57 IST)
రోజూ దైనందిక కార్యక్రమాలతోపాటు ఈసారి వర్కవుట్‌లను కూడా సమంత అక్కినేని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసింది. దీనికి ఆమె అభిమానులు ఫిదా అయిపోతున్నారు. నెటిజర్లు అయితే ఇంత కష్టపడి వర్కవుట్ చేస్తుందా! అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోలో చూసినట్లు రెండు చేతులతో ఇలా ఆసనం వేయడం చాలా కష్టం. ఇది కేవలం యోగా చేసేవారికి సాధ్యం. సమంత అన్నింటిలోనూ గ్రేట్ అంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు.
నిన్న సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన ఉదయ వ్యాయామం దినచర్యను పంచుకుంది. ఉదయం 7.32 గంటలకు సామ్ చేసిన హెడ్ స్టాండ్ వ్యాయామం వీడియో, పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. తను వర్కవుట్ చేస్తుండగా కోచ్ కూడా పక్కనే వుండి ఎలా కేర్ తీసుకుంటున్నారో కూడా ఫొటో షేర్ చేసింది. ప్రస్తుతం కరోనా సెకండ్‌వేవ్ ను జాగ్రత్తగా ఆరోగ్యం కోసం మలుచుకుంటుంది. సమంత ఈ సంవత్సరం 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'తో డిజిటల్ అరంగేట్రం చేయనుంది.
తర్వాతి కథనం