మహా గాయకుడు ఎస్పీబాల సుబ్రహ్మణ్యంకు ఎన్నో ఏళ్లుగా కొత్త గాయనీగాయకులుగా పరిచేసే ప్రోగ్రామ్‌ను ప్రముఖ టీవీ సంస్థ ఈటీవీ నిర్వహించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఎంతోమంది ఔత్సాహిక కళాకారులను వెలుగులోకి తెచ్చింది. ఆ అవకాశం నా ద్వారా రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఎస్.పి. బాలు చెప్పేవారు. పాటలు పాడితే వారి గాత్ర శుద్ది, బీజం, ఆరోహణ, అవరోహణ, దీర్ఘాలు, పదాలను నొక్కి పెట్టడం వంటి వెన్నో మెళుకువలను కూలంకషంగా వారికి విశదీకరించేవారు. ఆయా పాటలతో తనకున్న అనుభవాలను సంగీత దర్శకులతో తనకున్న పరిచయాలను, పాట పాడే సందర్భానుసార విషయాలను వెల్లడిస్తూ కార్యక్రమాన్నిరక్తికటించారు. ఇక ఆయన తర్వాత అలాంటి వ్యక్తి ఎవరు వస్తారా? అనే ప్రశ్న అప్పట్లోనే చాలామందిలో నెలకొనేది.
తాజాగా ఆ అవకాశం మరలా పాడుతా తీయగా ద్వారా ఎస్.పి. బాలు తనయుడు ఎస్.పి. చరణ్‌కు దక్కింది. ఇది ఈనెలలోనే ఆదివారం టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయింది. జూన్ 4న ఎస్.పి. జయంతి. జూన్5వ తేదీన పాడుతా తీయగా సరికొత్త హంగులతో వస్తుందని సంస్థ ప్రోమో విడుదల చేసింది. విశేషం ఏమంటే ఇందులో ఒకప్పుడు పాటల పోటీలో పాల్గొన్న సునీత జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇది తనకు దక్కిన అపూర్వమైన అవకాశమనీ, మాటలు అందడంలేదని పేర్కొంది. ఈ సందర్భంగా గాన గంధర్వుడు ఎస్.పి.బాలుకు మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొంది.