Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైరాలో హైలైట్ సీన్ ఇదే... ఇంత‌కీ ఏంటా సీన్..?

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (14:07 IST)
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 151వ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ సంచ‌ల‌న చిత్రం అక్టోబ‌ర్ 2న వ‌ర‌ల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొత్తగా ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచే ఒక సన్నివేశానికి సంబంధించిన సమాచారాన్ని ఈ పోస్టర్ ద్వారా ఇచ్చారు. నోస్సం ఫోర్ట్ నేపథ్యంలోని యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్‌గా నిలవనుందని అంటున్నారు. దేశ విదేశాలకి చెందిన ఆర్టిస్టులు.. ఫైటర్స్ కలుపుకుని 2000 మందితో, 35 రాత్రుల పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను గ్రాండ్‌గా చిత్రీకరించినట్టుగా చెప్పారు. 
 
రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సన్నివేశం ఉంటుందని చెబుతున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరుగుతున్నాయి. ఈ సినిమా విజ‌యం పై చిత్ర యూనిట్ గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నారు. మ‌రి... ఈ సంచ‌ల‌న చిత్రం సైరాతో మెగాస్టార్ ఏ స్థాయి విజ‌యాన్ని సాధిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

6 నిమిషాల్లో 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టేసిన మహిళ (video)

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments