మెగాస్టార్ చిరంజీవి నటించిన సంచలన చిత్రం సైరా నరసింహారెడ్డి. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అక్టోబర్ 4న వెంకీ, చైతుల వెంకీ మామ రిలీజ్ చేయాలనుకున్నా... వాయిదా వేసారు. ఎందుకంటే... సైరాతో పోటీపడడం బాగోదనే ఉద్దేశ్యంతో. అయితే ఊహించని విధంగా గోపీచంద్ చాణక్య సినిమాని అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
గోపీచంద్ చాణక్య రిలీజ్ అక్టోబర్ 5న అని ప్రకటించినప్పటి నుంచి ఇటు ఇండస్ట్రీలోను, అటు ఆడియన్స్ లోను ఏంటి.. గోపీచంద్ ధైర్యం.? చాణక్య మూవీ స్క్రిప్ట్‌లో అంత దమ్ముందా.? సైరా మూవీకి పోటీగా మూడు రోజుల తేడాతో ఎందుకు రిలీజ్ చేస్తున్నారు?
సహజంగా పెద్ద మూవీకి పోటీగా మరో చిత్రం విడుదల ఉండదు. ఈ మధ్య కాలంలో మూవీ రిలీజ్ లో పోటీ లేకుండా వాయిదాలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అలాంటిది గోపీచంద్ ఎందుకింత సాహసం చేస్తున్నారు. ఎనౌన్స్ చేసినట్టుగా అక్టోబర్ 5న చాణక్య చిత్రాన్ని రిలీజ్ చేస్తారా..? లేక ఆఖరి నిమిషంలో వాయిదా వేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఏం జరగనుందో చూడాలి.