Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పెళ్లి చేసుకోనున్న హీరో వెంకటేష్ తనయ?

టాలీవుడ్ హీరోలు చూసేందుకు కుర్రోళ్లుగా కనిపిస్తారు. కానీ, వారికి పెళ్లీడుకొచ్చిన కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది ప్రేమ వివాహాలకే మొగ్గు చూపుతున్నారు. తమ మనసుకు నచ్చితే కులంగోత్రాలు, ఆస

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (15:03 IST)
టాలీవుడ్ హీరోలు చూసేందుకు కుర్రోళ్లుగా కనిపిస్తారు. కానీ, వారికి పెళ్లీడుకొచ్చిన కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది ప్రేమ వివాహాలకే మొగ్గు చూపుతున్నారు. తమ మనసుకు నచ్చితే కులంగోత్రాలు, ఆస్తులు అంతస్తులను పట్టించుకోకుండా మూడుముళ్ళ బంధంతో ఒక్కటయ్యేందుకు అమితాసక్తి చూపుతున్నారు.
 
ఈ కోవలో టాలీవుడ్ మన్మథుడుగా ఉన్న అక్కినేని నాగార్జున కుమారుడు నాగ చైతన్య. హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలాగే, చిరంజీవి తనయుడు రామ్ చరణ్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్‌ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు. 
 
కానీ, టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఆయనకు పెళ్లీడుకొచ్చిన కుమార్తె ఆశ్రిత ఉంది. ఈ యువతి ఓ యువకుడుతో ప్రేమలో పడినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిన వెంకటేష్ కుమార్తె అభీష్టం మేరకు ప్రేమ వివాహం చేయాలని భావిస్తున్నట్టు ఫిల్మ్ నగర్‌ వర్గాల సమాచారం. 
 
నిజానికి ఇప్పటివరకూ వెంకీ తన కుటుంబ సభ్యులను పెద్దగా బయట ప్రపంచానికి చూపించింది లేదు. వెంకీకి ఒక కుమారుడు అర్జున్, కూతురు ఆశ్రిత ఉన్నారు. కూతురు ఆశ్రిత బేకరి రంగంలో వృత్తి నిపుణురాలిగా శిక్షణ తీసుకుంది. ఆమె ఓ ప్రముఖుడి కుమారుడిని ప్రేమించిందని తెలుస్తోంది. 
 
వారిద్దరి మధ్య చదువుకునే రోజుల నుంచి స్నేహం ఉందట. అది కాస్తా ప్రేమగా అనంతరం పెళ్లిగా మారినట్టు తెలుస్తోంది. ఆశ్రిత ప్రేమ వ్యవహారాన్ని ఇటీవల తన అన్న సురేష్ బాబుతో చర్చించిన వెంకీ.. కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ఘనంగా నిశ్చితార్థ వేడుక కూడా నిర్వహించనున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments