Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కినేని కుటుంబానికి పెద్ద షాక్ ఇచ్చిన చైతు, సమంత...

చైతన్య, సమంత గత యేడాది పెళ్ళి చేసుకున్నారు. వచ్చే నెలలో వీరి మొదటి వెడ్డింగ్ యానవర్సరీ. పెళ్లిరోజు వేడుక సందర్భంగా ఈ జంట ఒక వెరైటీ నిర్ణయం తీసుకుందట. అది కూడా అక్కినేని కుటుంబాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయమట.

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (14:59 IST)
చైతన్య, సమంత గత యేడాది పెళ్ళి చేసుకున్నారు. వచ్చే నెలలో వీరి మొదటి వెడ్డింగ్ యానవర్సరీ. పెళ్లిరోజు వేడుక సందర్భంగా ఈ జంట ఒక వెరైటీ నిర్ణయం తీసుకుందట. అది కూడా అక్కినేని కుటుంబాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయమట. 
 
నాగ చైతన్య, సమంత గత యేడాది అక్టోబర్ 6వ తేదీన పెళ్ళి చేసుకున్నారు. వీరి మొదటి వెడ్డింగ్ యానివర్సరీకి సమయం ఆసన్నమైంది. అయితే ఈ ఫస్ట్ యానివర్సరీని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవడం లేదని చెబుతోంది సమంత. ఆ రోజు కూడా సమంత షూటింగ్‌లో పాల్గొనాలన్న నిర్ణయం తీసేసుకుందట.
 
ఏ మాయే చేశావె, ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో నటించిన సమంత, నాగ చైతన్య పెళ్ళి తరువాత కలిసి నటించలేదు. పెళ్లయిన యేడాది తరువాత ఇప్పుడు జంటగా యాక్ట్ చేస్తున్నారు. అందుకే తమ పెళ్ళి రోజునే ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. సినిమాల వల్లే ప్రేమలో పడ్డారు కాబట్టి సినిమా సెట్స్‌లోనే తమ వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటారట. 
 
నాగ చైతన్య, సమంతలకు హిట్ కపుల్, హాట్ కపుల్ అన్న ఇమేజ్ ఉంది. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. పెళ్ళయిన తరువాత కూడా సమంత వరుసగా సినిమాలు చేస్తోంది. పెళ్ళిరోజు కూడా ఆమె పనిచేస్తుండటం మరో విశేషమే అంటున్నారు తెలుగు సినీపరిశ్రమలోని వారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దావోస్‌లో తెలుగు ముఖ్యమంత్రులు.. జ్యూరిచ్ విమానాశ్రయంలో మీటయ్యారు.. (video)

నారా లోకేశ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి! : క్లారిటీ ఇచ్చిన టీడీపీ

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ట్విస్ట్... ఏం జరిగిందంటే..?

నారా లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి.. హోం మంత్రి అనిత ఏమన్నారంటే?

ఆర్జీకర్ వైద్యురాలి హత్య కేసు : ముద్దాయికి ఉరిశిక్ష ఎందుకు విధించలేదు.. కోర్టు వివరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments