Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోగా ఎన్టీఆర్.. నిర్మాతగా రామ్ చరణ్.. మరి దర్శకుడు?

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ అటు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. తన తండ్రి చిరంజీవితో "ఖైదీ నంబర్ 150"వ చిత్రాన్ని నిర్మించిన చెర్రీ.. ఇపుడు మెగాస్టార్‌తోనే "సైరా నరసింహా రెడ్డి" చిత్రా

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (14:50 IST)
మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ అటు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. తన తండ్రి చిరంజీవితో "ఖైదీ నంబర్ 150"వ చిత్రాన్ని నిర్మించిన చెర్రీ.. ఇపుడు మెగాస్టార్‌తోనే "సైరా నరసింహా రెడ్డి" చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ పరిస్థితుల్లో ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది.
 
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చెర్రీ ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడనే వార్త ఇపుడు ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ఒక హీరోగానే కాకుండా ఒక నిర్మాతగా కూడా చెర్రీ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను నెలకొల్పాడు. ఈ బ్యానర్‌పైనే 'ఖైదీ నం.150' సినిమాను చెర్రీ నిర్మించాడు. 
 
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది. ప్రస్తుతం మరో భారీ బడ్జెట్ సినిమా 'సైరా నరసింహా రెడ్డి' తెరకెక్కుతోంది. ఇక ఈ బ్యానర్‌లో రాబోయే మూడో సినిమా ఎన్టీఆర్‌తో ఉంటుందనేది టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇదే నిజమైతే అభిమానుల ఆనందానికి అవధులుండవు.. ఇక అంతా రచ్చ రచ్చే. అయితే దీనిపై కొణిదెల ప్రొడక్షన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యను వదిలి హిజ్రాతో సహజీవనం... ఎవరు ఎక్కడ?

బాగా ఫేమస్ అవ్వాలి మామా.. బాగా బతికి పేరు తెచ్చుకునే ఓపిక లేదు.. బాగా చంపి ఫేమస్ అయ్యేదా... (Video)

అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments