Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హస్తం పార్టీలో చేరనున్న టాలీవుడ్ నిర్మాత...

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయ కండువా కప్పుకోనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

Advertiesment
Bandla Ganesh
, శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (09:33 IST)
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ రాజకీయ కండువా కప్పుకోనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నేడు (శుక్రవారం) జరగనున్న కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సమక్షంలో గణేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టికెట్‌పై షాద్‌నగర్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆయనతోపాటు మరికొందరు కూడా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. గణేశ్ చేరికతో షాద్‌నగర్‌లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని, ఆయన సినీ గ్లామర్ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షూటింగ్ లొకేషన్లకు షటిల్ సర్వీస్... జోష్ పెంచిన పూజా