Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ వెడ్డింగ్ వీడియో వ్యూస్ కంటే ఎక్కువ వచ్చేలా చేస్తా.. అమృతకు వార్నింగ్ ఇచ్చిన తండ్రి

ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కన్నబిడ్డను విధవరాలిని చేశాడు ఆ కన్నతండ్రి. దళిత వర్గానికి చెందిన వరుడిని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో కుమార్తె భర్త ప్రణయ్‌ను చంపేశాడు.

Advertiesment
మీ వెడ్డింగ్ వీడియో వ్యూస్ కంటే ఎక్కువ వచ్చేలా చేస్తా.. అమృతకు వార్నింగ్ ఇచ్చిన తండ్రి
, సోమవారం, 17 సెప్టెంబరు 2018 (10:56 IST)
ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కన్నబిడ్డను విధవరాలిని చేశాడు ఆ కన్నతండ్రి. దళిత వర్గానికి చెందిన వరుడిని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో కుమార్తె భర్త ప్రణయ్‌ను చంపేశాడు. అయితే, అమృత తన వెడ్డింగ్ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. దీనికి వేలాది సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన తండ్రి మారుతిరావు కుమార్తెకు తీవ్రమైన హెచ్చరిక చేశాడు.
 
"నీ పెళ్లి వీడియో కంటే, ప్రణయ్‌ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్‌ వస్తాయి' అంటూ అమృతవర్షిణికి మారుతిరావు హెచ్చరించారు. ఫేస్‌బుక్‌లో మూడు వారాల క్రితం అమృత ఈ వీడియోను పోస్టు చేయగా, ఇప్పటివరకూ 96 వేల హిట్స్ వచ్చాయి. అంటే, ఈ వీడియోను దాదాపు లక్ష మంది చూసినట్టు. 
 
ఇక శుక్రవారం ప్రణయ్‌పై బలమైన కత్తితో దాడి చేస్తున్న వేళ, ఆ దృశ్యాలు మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి ముందు అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలను అన్ని తెలుగు టీవీ వార్తా చానల్స్‌తో పాటు ఇంగ్లీషు, హిందీ తదితర జాతీయ చానళ్లు సైతం చూపించాయి. ఈ దృశ్యాలను కొన్ని లక్షల మంది తిలకించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో ర్యాగింగ్ భూతం.. బాలుర ప్రైవేట్ పార్ట్స్‌ను మాంజా దారంతో కట్టేసి?