Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేను మారుతీ రావులాంటోడిని కాదు... మంచోడిని... వచ్చేయండని నరికేశాడు...

ప్రేమ వివాహం అంటే చాలు... ప్రేమికుల తల్లిదండ్రులు వెనకాముందు చూడకుండా కత్తులు తీసుకుని నరికేస్తున్నారు. అదీ కాదంటే కిరాయి హంతకులను రంగంలోకి దింపి వారితో హత్య చేయిస్తున్నారు. మిర్యాలగూడ మారుతీరావు ఘాతుకం మరువకముందే ఎర్రగడ్డలో నడిరోడ్డుపై మరో తండ్రి తన

Advertiesment
నేను మారుతీ రావులాంటోడిని కాదు... మంచోడిని... వచ్చేయండని నరికేశాడు...
, గురువారం, 20 సెప్టెంబరు 2018 (16:30 IST)
ప్రేమ వివాహం అంటే చాలు... ప్రేమికుల తల్లిదండ్రులు వెనకాముందు చూడకుండా కత్తులు తీసుకుని నరికేస్తున్నారు. అదీ కాదంటే కిరాయి హంతకులను రంగంలోకి దింపి వారితో హత్య చేయిస్తున్నారు. మిర్యాలగూడ మారుతీరావు ఘాతుకం మరువకముందే ఎర్రగడ్డలో నడిరోడ్డుపై మరో తండ్రి తన కన్నకుమార్తెనే నడిరోడ్డుపై కత్తి తీసుకుని విచక్షణారహితంగా నరికాడు. దానితో ఆమె ఆసుపత్రిలో చావుబతుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 
 
గత వారం ప్రేమ పెళ్లి చేసుకున్న సందీప్-మాధవిలను నమ్మించి మరీ కత్తితో దాడి చేశాడు. మాధవి తండ్రి మనోహరాచారి పెళ్లాడిన తన కుమార్తె-అల్లుడు సందీప్‌తో ఫోన్లో మాట్లాడుతూ... తను మారుతీ రావు లాంటి వాడిని కాదనీ, తన కూతురిని ఒక్కసారి చూడాలని వుందనీ, ఇంటికి రావాలని వారిని నమ్మించాడు. కన్న తండ్రి పిలిచేసరికి మాధవి రెండో ఆలోచన లేకుండా సందీప్‌ను వెంటబెట్టుకుని మోటారు బైకుపై గోకుల్ థియేటర్ వద్దకు రాగానే అల్లుడు, కుమార్తెపై కత్తి తీసుకుని దాడి చేశాడు. ఈ దాడిలో మాధవి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అల్లుడు సందీప్ సురక్షితంగా బయటపడ్డాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాముతో శునకం ఢీ.. పప్పీలను కాటేసిన నాగుపాము