Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతాజీ అదృశ్యంపై సినిమా.. ఫస్ట్ లుక్

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (11:38 IST)
భారత స్వాంతంత్ర్య పోరాటయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితంతోపాటు ఆయన అదృశ్యంపై ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి "గుమ్నా మీ'' అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. 
 
ఈ బాలీవుడ్‌‌ సినిమాకు 'ది గ్రేటెస్ట్ స్టొరీ నెవర్ టోల్డ్' అనే ట్యాగ్‌లైన్ పెట్టారు. ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, నేతాజీ జయంతి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. 
 
దేశ స్వాతంత్ర్యానికి ముందు జరిగిన సుభాష్ చంద్రబోస్ అదృశ్యంపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్న విషయం తెల్సిందే. విమాన ప్రమాదంలో ఆయన మరణించారని కొందరంటే, కాదు హిమాలయాల్లో బాబాగా అజ్ఞాత జీవితం గడిపారని మరికొందరంటారు. ఈ విషయంపై సరైన స్పష్టత మాత్రం లేదు. 
 
అనూజ్ ధర్, చంద్రసూడ్ ఘోస్‌లు రచించిన 'కోనండ్రమ్' అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్‌‌లుక్‌ పోస్టర్‌లో ఒక వృద్ధుడు గోడవైపు చూస్తున్నాడు. అక్కడ నేతాజీ మిస్సింగ్‌‌, విమాన ప్రమాదంలో మృతి వంటి పలు పేపర్ క్లిప్పింగ్స్ అతికించి ఉన్నాయి. ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి నెలలో విడుదలకానుంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments