Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కుంభమేళా యాత్రికుల కోసం ‘కుంభ్ జియో ఫోన్‌’... ఈ ఫోన్‌తో యావత్ సంబరం మీ చెంతనే...

Advertiesment
కుంభమేళా యాత్రికుల కోసం ‘కుంభ్ జియో ఫోన్‌’... ఈ ఫోన్‌తో యావత్ సంబరం మీ చెంతనే...
, మంగళవారం, 8 జనవరి 2019 (17:41 IST)
దేశీయ టెలికాం రంగంలో పెను సంచలనం జియో ఫోన్..! 4జీ సేవలు అందిస్తున్న ఫీచర్ ఫోన్ ఏదైనా ఉందా అంటే... అది జియో ఫోన్ మాత్రమే..! చౌక ధరకే లభిస్తూ.. అతి తక్కువ రిచార్జితో.. పేద, గ్రామీణ ప్రజలు డిజిటల్ ప్రపంచానికి చేరువ చేసింది.
 
తాజాగా సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది రిలయల్స్ జియో. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవం ‘కుంభమేళా-2019’కు హాజరయ్యే భక్తుల కోసం ‘కుంభ్‌ జియో ఫోన్‌’  పేరుతో ఒక ప్రత్యేక జియోఫోన్‌ను రూపొందించింది. తద్వారా  జనవరి 15 నుంచి మార్చి 4 వరకు కొనసాగే  కుంభమేళాకు హాజరయ్యే 13 కోట్ల మందికి పైగా భక్తులకు విశేష సేవలందించేందుకు సిద్ధమైంది. కుంభ మేళా, ముఖ్యమైన ఫోన్‌ నంబర్లు, ప్రభుత్వ సంబంధిత సేవలు వంటి వివిధ సమాచారాన్ని అరచేతిలో అందించడానికి  తీసుకొచ్చింది.
 
ఈ జియో ఫోన్ మీ అరచేతిలో ఉంటే... యావత్ కుంభమేళా మీ చెంతన ఉన్నట్లే...! కుంభ్ జన సముద్రంలో యాత్రికులకు కుంభ్‌ జియో ఫోన్‌ ఎన్నో విధాలుగా ఉపయోగపడనుంది. 1991 హెల్ప్‌లైన్‌ ద్వారా సహాయంతో పాటు, ఉచిత వాయిస్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌ సేవలను జియో  అందించనుంది. తమ కుటుంబ సభ్యులను మిస్‌కాకుండా ‘ఫ్యామిలీ లొకేటర్‌’ పేరుతో ఒక యాప్‌ను అందిస్తోంది. తప్పిపోయిన కుటుంబ సభ్యులు, మిత్రులను కలిపేందుకు యూపీ పోలీసులు, కాష్‌ ఐటీ సంస్థ సహకారంతో జియో ఈ ఏర్పాట్లు చేసింది.
 
ఇతర ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...
1. సమగ్ర సమాచారం
కుంభమేళా సమాచారం, రియల్ టైమ్ ట్రావెల్ సమాచారం (రైళ్లు, బస్సులు, విమానాల వివరాలు), ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్, రైల్వే స్టేషన్స్ సమీపంలో వసతి సదుపాయ వివరాలు, ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్లు, అలహాబాద్ (ప్రయాగ్ రాజ్) రూట్ మ్యాప్స్, పవిత్ర స్నానాలు, పూజల షెడ్యూల్, రైల్వే క్యాంప్ మేళాతో పాటు మరెన్నో...
 
2. కుంభమేళాలో క్షేమంగా...
ఫ్యామిలీ లొకేటర్: మీ కుటుంబ సభ్యులు, మిత్రులు ఎవరు ఎక్కడ ఉన్నారో..ఖచ్చితమైన లోకేషన్ చూపిస్తుంది. 
ఖోయా పాయా (Lost & Found): మీ వెంట వచ్చిన వారిలో ఎవరైనా తప్పిపోతే వారి ఆచూకీ కొనుగొనవచ్చు.
 
3. జియో ఫోన్‌లో కుంభమేళా
కుంభ్ దర్శన్: కుంభమేళాలో జరిగే అన్ని ప్రత్యేక కార్యక్రమాలను జియో టీవీ ద్వారా లైవ్‌లో చూడవచ్చు. కుంభ్ రేడియో: కుంభమేళాతో పాటు ఇతర భక్తి పాటలను 24 గంటలూ ఈ రేడియోలో వినవచ్చు.
 
4. న్యూస్ అలర్ట్స్:
కుంభమేళాకు సంబంధించిన ముఖ్యమైన ప్రకటనలు, వార్తలను ఎప్పటికప్పుడు పొందవచ్చు.
 
5. వినోదం :
గేమ్స్: కుంభ్‌మేళా సందర్శన సమయంలో ఎంచక్కా గేమ్స్ ఆడుకోవచ్చు.
క్విజ్: కుంభమేళాకు సంబంధించిన ప్రశ్నలతో క్విజ్ ఉంటుంది. మీ సమాధానాలను తెలిపి బహుమతులు కూడా గెలవొచ్చు.
webdunia
 
ఇవే కాదు జియో ఫోన్‌లో ఎన్నో ఇతర ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌లో లభించే ప్రతి సదుపాయాన్ని జియో ఫోన్ ద్వారా పొందవచ్చు. కుంభమేళా ఫీచర్లు అన్ని పాత, కొత్త జియో ఫోన్లలో అందుబాటులో ఉంటాయి. జియో ఫోన్‌లోని జియో స్టోర్ ద్వారా వీటన్నింటిని ఈ సదుపాయాలన్నింటినీ పొందవచ్చు. జియో ఫోన్‌కు సంబంధించిన అన్ని వివరాల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ 1991ని రిలయన్స్ రిటైల్ ఏర్పాటు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాక్‌పాట్‌లు.. బంపర్ ప్రైజ్‌లంటే నమ్మొద్దు.. బ్యాంకుల హెచ్చరిక