Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో.... పేరు వైష్ణవ్ తేజ్

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (11:26 IST)
తెలుగు సినీ ఇండస్ట్రీకి మరో హీరో పరిచయమయ్యాడు. ఈయన మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాడు. హీరో సాయిధరమ్ తేజ్ స్వయానా సోదరుడు వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ హీరోగా నటించే చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం తాజాగా జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సోదరుడు నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు హాజరయ్యారు. 
 
తొలి క్లాప్‌ను చిరంజీవి కొట్టగా, అల్లు అర్జున్, నాగబాబు, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ తదితరులు స్క్రిప్టును అందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై రూపొందనున్న ఈ సినిమాకు బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. లెక్కల మాస్టారుగా గుర్తింపు పొందిన కె.సుకుమార్ ఈ చిత్రానికి కథను సమకూర్చుతుంటే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. 
 
వైష్ణవ్ తేజ్ గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన చిత్రంలోనూ, మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ చిత్రంలోనూ నటించాడు. కాగా, ఈ మెగా హీరో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విషాదం.. పెళ్లి కాలేదని రైలుకిందపడి వైద్యుడి ఆత్మహత్య

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments